సూర్య కెప్టెన్సీకి ముప్పు.. డేంజర్‌లో నలుగురు స్టార్ల కెరీర్!
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ప్రస్తుతం టోర్నీలో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. సూపర్-8 దశలో భాగంగా నేడు(ఫిబ్రవరి 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన 'డూ ఆర్ డై' పోరు. ఒకవేళ నేడు ఫలితం తేడా కొట్టి భారత్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే.. జట్టులోని పలువురు స్టార్ ఆటగాళ్ల కెరీర్‌పై వేటు పడటం ఖాయమని క్రీడా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సెమీఫైనల్ సమీకరణాలు ఇవే..
భారత్ సెమీఫైనల్ చేరడం ఇప్పుడు పూర్తిగా తన చేతుల్లో లేదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో భారత్ నెట్ రన్ రేట్ -3.800కి పడిపోయింది. భారత్ ముందడుగు వేయాలంటే.. నేడు జింబాబ్వేపై భారీ తేడాతో విజయం సాధించాలి. అదే సమయంలో అహ్మదాబాద్‌లో జరిగే మరో కీలక పోరులో వెస్టిండీస్‌ను దక్షిణాఫ్రికా ఓడించాలని కోరుకోవాలి. ఒకవేళ వెస్టిండీస్ గెలిస్తే.. రన్ రేట్ పరంగా వెనుకబడిన భారత్ ఇంటిదారి పట్టక తప్పదు. ఈ ఉత్కంఠభరిత సమీకరణాల మధ్య భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

అభిషేక్ శర్మ
ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో నంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. గతేడాది కాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్.. ఈ ప్రపంచకప్‌లో మాత్రం చేతులెత్తేశాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి, మూడు సార్లు డకౌట్ అయ్యారు. ఓపెనింగ్ జోడి విఫలం కావడం జట్టును దెబ్బతీస్తోంది. అభిషేక్ ఇలాగే విఫలమైతే.. బెంచ్ మీద ఉన్న యశస్వి జైస్వాల్ లేదా త్వరలో 15 ఏళ్లు నిండి జట్టులోకి రానున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దారులు సుగమం అవుతాయి.
తిలక్ వర్మ
మరోవైపు నంబర్ 3 స్థానంలో ఆడుతున్న తిలక్ వర్మ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అత్యంత కీలకమైన పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆయన.. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (118.88) కూడా టీ20 ప్రమాణాలకు తగ్గట్టుగా లేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాధ్యతారాహిత్యంగా షాట్ ఆడి ఔటవ్వడంపై సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా మండిపడ్డారు. తిలక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్ అయ్యర్ వంటి అనుభవజ్ఞులు రేసులో ఉండటం గమనార్హం.
రింకూ సింగ్
ఫినిషర్ పాత్రలో మెరిపిస్తాడనుకున్న రింకూ సింగ్ కూడా ఈసారి నిరాశపరిచాడు. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశారు. రింకూ సింగ్‌కు తక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పటికీ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా గత మ్యాచ్‌లో డకౌట్ అవ్వడం ఆయన గ్రాఫ్‌ను తగ్గించింది.
సూర్యకుమార్ యాదవ్
ప్రస్తుత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 180 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా ఉన్నప్పటికీ.. తన సహజ సిద్ధమైన శైలిలో ఆడలేకపోతున్నాడు. అతని కెరీర్ స్ట్రైక్ రేట్ 162.77 కాగా, ఈ టోర్నీలో అది 127.65కి పడిపోయింది. 35 ఏళ్ల వయసులో ఉన్న సూర్య సారథ్యంలో భారత్ సెమీస్ చేరకపోతే, సూర్య టీ20 కెరీర్‌పై సెలక్టర్లు పునరాలోచన చేసే అవకాశం ఉంది..
నేటి మ్యాచ్ భారత జట్టుకు ఒక అగ్నిపరీక్ష. జట్టు ఓడిపోయి టోర్నీ నుంచి తప్పుకుంటే.. సీనియర్ల స్థానంలో యువ రక్తాన్ని ఎక్కించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉంది. మరి జింబాబ్వేపై 'సూర్య బ్రిగేడ్' సత్తా చాటి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందో లేదో వేచి చూడాలి!
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications