ఆ టైంలో ఇషాన్ కిషన్ పై కోపం వచ్చింది - సూర్యకుమార్ ..!!
Ind Vs NZ T20: ఇషాన్ కిషన్ మెరుపులు.. సూర్య కుమార్ బౌండరీలతో న్యూజీలాండ్ తో జరిగిన రెండో టీ20 లో టీమిండియా విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(76) మెరుపు ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ తిరిగి తన మునుపటి ఫాం ప్రదర్శించారు. దీంతో, అయిదు మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా ఆధిక్యతలో ఉంది. కాగా.. ఈ మ్యాచ్ సమయంలోనే తనకు ఇషాన్ కిషన్ పైన కోపం వచ్చిందంటూ సూర్య కుమార్ చెప్పిన విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. ఓపెనర్ అభిషేక్ వర్మ విఫమైనా సూర్య ఏరి కోరి తెచ్చుకున్న ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. కివీస్ బౌలర్ల పైన చెలరేగిపోయాడు. బౌండరీలే హద్దుగా వీర బాదుడు బాదాడు. అదే విధంగా సూర్య కుమార్ సైతం తన మార్క్ ఇన్నింగ్స్ ఆడి టీంను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరు పలు రికార్డులను నెల కొల్పారు. ఈ ఇద్దరి బ్యాటింగ్ లో బౌండరీలు బాదుతుండటంతో కివీస్ బౌలర్లకు చెమటలు పట్టాయి. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌పై కోపంగా ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సూర్య కుమారే వెల్లడించాడు.

రెండు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ అప్పటికే ఆడుతున్న ఇషాన్ కిషన్ తో జత చేరాడు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఎక్కడా సూర్య కుమార్ కు ఛాన్స్ ఇవ్వకుండా ఒన్ మ్యాన్ షో తో ఫ్యాన్స్ కు మజా అందించాడు. ఇషాన్ క్రీజులో ఉన్నంత సేపు దాదాపు ప్రతి ఓవర్‌లో మెజారిటీ బంతులు అతనే ఆడాడు. వీరిద్దరి మధ్య 43 బంతుల్లో 122 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు కాగా.. ఇందులో కిషన్ 31 బంతుల్లో 76 పరుగులు బాదేశాడు. సూర్యకు కేవలం 12 బంతులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
అందులో సూర్య 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీని పైన స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. 'ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో నాకు అసలు స్ట్రైక్ ఇవ్వలేదు..ఆ సమయంలో బాగా కోపం వచ్చింది. ఇషాన్ లంచ్‌లో ఏం తిన్నాడో తెలియదు. కానీ అతడు బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదు... కిషన్ దూకుడుగా ఆడటంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది..' అంటూ సూర్య చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications