మరో సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్: కీ రిప్లేస్మెంట్

ఆస్ట్రేలియా ఎ జట్టుతో పుదుచ్చేరి వేదికగా జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత ఎ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాజా గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. అతని స్థానంలో ముంబైకి చెందిన సూర్యాంశ్ షెడ్గె ఎంపికయ్యాడు. ఈ నెల 6, 9, 11 తేదీల్లో టీమిండియా ఏ- ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య ఈ మ్యాచ్ లు జరుగనున్నాయి. తన సత్తా నిరూపించుకోవడానికి షెడ్గెకు సువర్ణావకాశాన్ని లభించినట్టయింది.

హార్దిక్ పాండ్యాను వరుస గాయాల బెడద వదలట్లేదు. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా అతని కుడి పిక్క భాగంలో తీవ్ర అసౌకర్యం తలెత్తింది. అనంతరం నిర్వహించిన ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో అతనికి మైల్డ్ ఇంట్రామెడుల్లరీ ఎడెమా సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఫలితంగా.. రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు సైతం అతను ఎంపిక కావడం అనుమానమే. ఈ సిరీస్ కంటే ముందే పూర్తి ఫిట్‌నెస్ సాధించి జాతీయ జట్టులోకి తిరిగి రావాలనే పాండ్యా సుదీర్ఘ నిరీక్షణకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Suryansh Shedge Replaces Injured Setback Hardik Pandya in India A Squad Big Impact vs Australia A

హార్దిక్ పాండ్యాతో పాటు హర్షిత్ రాణా కూడా ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. గాయం కారణంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ లో ఉంటోన్నాడీ ఫాస్ట్ బౌలర్. దీనివల్ల ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సిరీస్ లను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆసియా గేమ్స్ కూ దూరం అయ్యాడు. ప్రస్తుతం అతని ఫిట్ నెస్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే న్యూజిలాండ్ పర్యటనకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని చెబుతున్నారు.

డీప్లీ డిస్టర్బ్డ్: తేలిగ్గా తీసుకోకూడదు- చిరంజీవి
డీప్లీ డిస్టర్బ్డ్: తేలిగ్గా తీసుకోకూడదు- చిరంజీవి

అటు షెడ్గె కూడా కొంతకాలం పాటు గాయాలతో సతమతం అయ్యాడు. కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దేశవాళీ టోర్నీలకు దూరం అయ్యాడు. బెంగళూరులో బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ లో రిహాబిలిటేషన్ లో గడిపాడు. తాజాగా అతను పూర్తి ఫిట్ నెస్ సాధించడంతో బీసీసీఐ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. తుది పరీక్షల అనంతరం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు నిర్ధారణ కావడంతో నేరుగా పుదుచ్చేరిలో ఉన్న భారత-ఎ తో చేరాడు.

ఈ ఏడాది ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో భారత్ తరఫున మూడు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు సూర్యాంశ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ భారత్ 'ఎ' తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడీ ఆల్ రౌండర్. అక్కడ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి అయిదు మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా తరహాలోనే బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ రాణించే సత్తా అతనికి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+