మీ సేవలు ఇక్కడితో చాలు: రాహుల్ ద్రావిడ్‌కు చివరి మ్యాచ్: ఎలా సాగనంపుతారో..?
IND vs SA: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ దండయాత్ర తుదిదశకు చేరుకుంది. ఫైనల్‌లో తన సమవుజ్జీ దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతోంది. ఈ మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. బార్బడొస్ రాజధాని బ్రిడ్జిటౌన్ కెన్నింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం దీనికి వేదిక. ఈ టోర్నమెంట్‌లో ఓటమి అనేదే తెలియని జట్లు ఈ రెండూ.
గుయానాలో జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది భారత్. 68 పరుగుల తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లల్లో టీమిండియా ప్లేయర్లు వారియర్స్‌ను గుర్తుకు తెచ్చారు. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తొలి సెమీ ఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది దక్షిణాఫ్రికా.

అంతకుముందు- లీగ్స్‌లో గానీ, సూపర్ 8లో గానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి చవి చూడలేదు. ఆడిన అన్నింట్లోనూ విజయదుందుభి మోగించాయి. 2014 తరువాత తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరింది భారత్. బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన అప్పటి ఫైనల్స్‌లో శ్రీలంక చేతిలో ఓడింది. ఇప్పుడు మళ్లీ ఛాంపియన్‌గా నిలిచే అవకాశానికి చేరువ అయింది.
టీ20 వరల్డ్ కప్ ఆరంభంలో బోణీ కొట్టిన తరువాత ఇప్పటివరకు మళ్లీ కప్‌ను అందుకునే ఛాన్స్ భారత్‌కు రాలేదు. ఇప్పుడు గెలిస్తే రెండోసారి కప్‌ను ముద్దాడినట్టవుతుంది. టీ20 వరల్డ్ కప్‌ను రెండుసార్లు జయించిన జట్టు వెస్టిండీస్ ఒక్కటే. 2012, 2016ల్లో విండీస్ వీరులు విజేతగా నిలిచారు.
దక్షిణాఫ్రికా పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. తొలిసారిగా ఫైనల్స్ చేరింది. ఐసీసీ నిర్వహించే ఏ టోర్నమెంట్‌ను తీసుకున్నా ఫైనల్స్ వరకూ రావడం ప్రొటీస్‌కు ఇదే తొలిసారి. ఒకరకంగా వారికి ఇది తొలి బిగ్గెస్ట్ ఫైనల్ మ్యాచ్. ఇందులో గెలిచితీరాలనే తపన వారిలో కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం వారి సన్నద్ధతకు అద్దంపడుతోంది.
కాగా- టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ఇదే చివరి మ్యాచ్. ఈ టోర్నమెంట్‌తో పాటు ఆయన కాంట్రాక్ట్ గడువు కూడా ముగుస్తుంది. దీన్ని రెన్యూవల్ చేయలేదు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్. ఆయన సేవలు ఇక్కడితో చాలనుకుంది. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ సైతం పూర్తి చేసింది.

ఇందులో భాగంగా టీమిండియా మాజీ ఓపెనర్లు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్‌తో ఇంటర్వ్యూలనూ నిర్వహించింది. రేపో మాపో కొత్త హెడ్ కోచ్ పేరును ప్రకటిస్తుంది బీసీసీఐ. ఈ పదవి కోసం బీసీసీఐ- గౌతమ్ గంభీర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా 2021లో రాహుల్ ద్రావిడ్ అపాయింట్ అయ్యారు. ఆ ఏడాది యుఏఈ వేదికగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్.. ఛార్జ్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో కోచ్‌గా బోణీ కొట్టారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును రాటుదేల్చారు.
ద్రావిడ్ పర్యవేక్షణలోనే గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఫైనల్స్ వరకూ వెళ్లగలిగింది టీమిండియా. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలమైంది. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. ఆ టోర్నమెంట్‌లో ఒక్క ఓటమి కూడా చవి చూడలేదు రోహిత్ సేన.
ఇప్పుడూ అదే పరిస్థితి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ వెళ్లగలిగింది. వరల్డ్ కప్ లోటును దీనితో పూడ్చాలనే పట్టుదలతో ఉంది భారత్. గ్రాండ్‌గా రాహుల్ ద్రావిడ్‌కు వీడ్కోలు పలకాలనే భావిస్తోంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందో? విజేత ఎవరో? ఈ రాత్రికి తేలిపోతుంది.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
Suryakumar Yadav: టీమిండియా కొలీగ్ కి సారీ చెప్పిన సూర్యకుమార్ యాదవ్...! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications