టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లపై భారీ ఉగ్రదాడికి ప్లాన్: ధృవీకరించిన విండీస్: పాక్ నుంచి థ్రెట్

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌పై ఉగ్రవాదులు కన్నేశారు. భారీ దాడులకు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది కూడా. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మ్యాచ్‌లు ఆడటానికి వచ్చే వివిధ దేశాల ప్లేయర్లు, ప్రేక్షకులకు భద్రతను కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకుంటోంది.

జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.

T20 World Cup 2024 receives terror threat in West Indies from Pakistan

తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.

ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా.

ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది. అటు టోర్నమెంట్ నిర్వహణ ముమ్మరంగా సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదుల దాడికి సంబంధించిన బెదిరింపులు అందడం కలకలం రేపుతోంది.

పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి ఈ బెదిరింపులు అందినట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది. కరడుగట్టిన భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్‌కు చెందిన ఆఫ్ఘనిస్తాన్ వింగ్ ఐఎస్-ఖొరాసన్, ప్రొ ఇస్లామక్ స్టేట్స్ (దాయేష్) గ్రూప్‌కు చెందిన అధికారిక మీడియా నషీర్ పాకిస్తాన్ నుంచి ఈ బెదిరింపులు అందినట్లు బోర్డు సీఈఓ జానీ గ్రేవ్స్ వెల్లడించారు.

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు సజావుగా సాగడానికి అన్ని చర్యలను తీసుకుంటోన్నామని అన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కీత్ రౌలీకి ఈ విషయాన్ని తెలియజేశామని వివరించారు. భద్రతపరంగా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని, అదనపు బలగాలను మోహరింపజేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+