T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపిక.. గంగూలీ రియాక్షన్ ఇదే..!
ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇస్తున్న టీ20 క్రికెట్ వరల్డ్ కప్ కు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని జట్లూ ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం పూర్తిస్ధాయిలో సన్నద్ధం అవుతున్నాయి. ఈసారి ఎలాగైనా టోర్నీని ఎగరేసుకుపోయేందుకు శ్రమిస్తున్నాయి. ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాకు కెప్టెన్ గా రోహిత్ శర్మను కొనసాగిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఓవైపు ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగింపుపై అభిమానుల్లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతున్న తరుణంలో ఏకంగా టీ20 వరల్డ్ కప్ కు హిట్ మ్యాన్ ను నాయకుడిగా ఎంపిక చేయడం సంచలనం రేపింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాలు, అభిమానులు అంతా పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ముంబై ఇండియన్స్ నిర్ణయానికీ, బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధం లేదనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ఛీఫ్ కూడా అయిన సౌరభ్ గంగూలీ స్పందించాడు. రోహిత్ శర్మను టీ20 వరల్డ్ కప్ లో ఆడే టీమిండియా కెప్టెన్ గా ఎంపిక చేయడంపై స్పందించిన గంగూలీ.. దీన్ని రైట్ ఛాయిస్ గా అభివర్ణించాడు. మిడ్ డే తో మాట్లాడుతూ.. రోహిత్ శర్మను ఈ మెగా టోర్నీకి కెప్టెన్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్ధించాడు.
తాజాగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ వరుసగా టీమిండియాకు 10 విజయాలు అందించిన విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్ లోనూ భారత్ ను విజయతీరాలకు చేర్చే సత్తా రోహిత్ కు ఉందన్నాడు. తద్వారా రోహిత్ శర్మ ఎంపికపై ఎలాంటి చర్చా అవసరం లేదని గంగూలీ తేల్చేశాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ నిర్ణయంతో నిరుత్సాహంగా ఉన్న రోహిత్ అభిమానులకు దాదా వ్యాఖ్యలు ఊరటగా మారాయి.












Click it and Unblock the Notifications