టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టుపై ఇంకాస్సేపట్లో ప్రకటన
T20 World Cup 2024 India squad: ఐపీఎల్ 2024లో ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ ఉర్రూతలూగించబోతోంది. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 2వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 29వ తేదీ వరకు కొనసాగుతుంది.
వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి. ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు.

ఇందులో ఆడబోయే దేశాల క్రికెట్ బోర్డులన్నీ కూడా మే 1వ తేదీ నాటికి తమ ప్లేయర్ల వివరాలను ప్రకటించాల్సి ఉంది. గడువులోగా ఈ జాబితాను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నేపథ్యంలో- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. నేడు జట్టును ప్రకటించనుంది. మొత్తం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించనుంది. జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పటికే తన కసరత్తు పూర్తి చేసింది బీసీసీఐ. తుది జాబితాను సిద్ధం చేసింది. దీన్ని నేడు విడుదల చేయనుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా- బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్, టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్, వెస్టిండీస్ లెజెండ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ బ్రియాన్ లారా భారత జట్టు కూర్పుపై తమ అంచనాలను వెల్లడించారు. ఎంపికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారి అంచనాలు ఎంత వరకు వాస్తవ రూపాన్ని దాల్చుతాయనేది నేడు తేలిపోనుంది.
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును అందరి కంటే ముందుగా ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తాడు. ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిఛెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిఛెల్ శాంట్నర్, ఈష్ సోధీ, టిమ్ సౌతీలకు చోటు దక్కింది. ట్రావెలింగ్ రిజర్వ్డ్‌గా బెన్ సియర్స్ ఉంటాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications