IND vs SA: టీమిండియా బొమ్మ తిరగబడింది!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా జోరుకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 76 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఘోర పరాజయంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా పిచ్ స్వభావాన్ని పూర్తిగా వాడుకుని మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ కనీస పోటీ ఇవ్వకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (35 బంతుల్లో 63 - 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా.., డెవాల్డ్ బ్రెవిస్ (45), ట్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 15 పరుగులకే 3 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్ 2, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 20 పరుగులివ్వడం మ్యాచ్ మూమెంటమ్‌ను సౌతాఫ్రికా వైపు మళ్లించింది. ఈ పరాజయంతో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వరుస విజయాల రికార్డ్‌కు బ్రేక్ పడింది. వరుసగా 17 మ్యాచ్‌ల తర్వాత టీమిండియాకు పరాజయం ఎదురైంది.

కప్పుకూలిన బ్యాటింగ్ లైనప్..
187 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. అత్యుత్సాహం, పిచ్‌ను పట్టించుకోకుండా చెత్త షాట్లతో భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. తొలి ఓవర్‌లోనే డేంజరస్ ఓపెనర్ ఇషాన్ కిషన్ డకౌట్ కాగా.. తిలక్ వర్మ (1), అభిషేక్ శర్మ (15) సైతం త్వరగా వెనుదిరిగారు. పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ 41 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
వాషింగ్టన్ సుందర్ (11), సూర్యకుమార్ యాదవ్ (18) కూడా విఫలం కావడంతో, 51 పరుగులకే 5 వికెట్లు పడిపోయి ఓటమి వైపు సాగింది. దక్షిణాఫ్రికా తరపున మార్కో యాన్సెన్ 4/22తో, కేశవ్ మహరాజ్ 3/24తో రాణించారు. కార్బిన్ బోష్ 2, ఎయిడెన్ మార్క్‌రమ్ ఒక వికెట్ తీశారు. శివమ్ దూబే (37 బంతుల్లో 42 - 1 ఫోర్, 3 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా (15) మహరాజ్ బౌలింగ్‌లో అవుట్ కాగా, రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు.
భారత్ సెమీస్ చేరాలంటే..?
ఈ పరాజయంతో టీమిండియా సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. తదుపరి జింబాబ్వే, వెస్టిండీస్‌తో జరిగే సూపర్-8 మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తేనే టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక మ్యాచ్ ఓడినా, వర్షంతో రద్దయినా అవకాశాలు సన్నగిల్లుతాయి. 76 పరుగుల భారీ తేడాతో ఓడటం టీమిండియా రన్‌రేట్‌ను దారుణంగా దెబ్బతీసింది. దీంతో తదుపరి మ్యాచ్‌లలో గెలవాల్సిన అదనపు ఒత్తిడి జట్టుపై నెలకొంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications