రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. విశ్వవిజేతగా భారత్

భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. 96 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించి చరిత్రను తిరగరాసింది. బ్యాటర్ల విధ్వంసం, బౌలర్ల పదునైన దాడితో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. 2007లో ధోనీ, 2024లో రోహిత్ శర్మ తర్వాత, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగుల భారీ స్కోరును చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది.

అహ్మదాబాద్‌లో రికార్డుల మోత
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఓపెనర్లు సంజూ శాంసన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) మెరుపు ఇన్నింగ్స్‌లతో కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. చివరలో శివం దూబే మెరుపులతో స్కోరు బోర్డు 250 దాటింది.

T20 World Cup 2026 Final India Crushes New Zealand to Become World Champions Full Details

కివీస్ కష్టాలు.. భారత్ విజయం
256 పరుగుల కష్టతరమైన లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి కనీస ప్రతిఘటన కూడా చూపలేకపోయింది. భారత పేసర్లు, స్పిన్నర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఫైనల్ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ - డేరిల్ మిచెల్ మధ్య జరిగిన వాగ్వాదం మినహా, మ్యాచ్ మొత్తం భారత్ ఏకపక్షంగా సాగింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ అత్యంత క్రమశిక్షణతో ఆడి ట్రోఫీని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫర్ట్(52), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(43) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లతో అదరగొట్టగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ తీశారు.

చారిత్రక ఘనత.. హ్యాట్రిక్ ట్రోఫీలు!
ఈ విజయంతో టీమిండియా టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడోసారి విజేతగా నిలిచింది. తన సొంత గడ్డపైనే ఈ టైటిల్‌ను నిలబెట్టుకోవడంతో పాటు, వరల్డ్ కప్‌ను డిఫెండ్ చేసుకున్న తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి అదే స్టేడియంలో ఇప్పుడు ఈ విజయంతో భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు యావత్ దేశం టీమిండియా విజయంపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

చారిత్రక విజయం
టీమిండియా ఈసారి సొంత గడ్డపై అద్భుతమైన ప్రదర్శనతో కప్పును అందుకుంది. ఈ విజయంతో భారత క్రికెట్ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు టీమిండియా సాధించిన ఈ ఘనవిజయాన్ని పండుగలా జరుపుకుంటున్నారు.సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ యువ జట్టు, రాబోయే కాలంలో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారత్ సాధించిన ఈ చారిత్రక విజయంపై క్రీడా విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+