Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంజూ శాంసన్ విధ్వంసం.. సెమీస్ చేరిన భారత్

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్‌ చేరింది. వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో సంజూ తన ఆల్‌టైమ్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. రోస్టన్ ఛేజ్ (25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40 పరుగులు), రోవ్‌మన్ పోవెల్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్ (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్)రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 36 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీశారు.

అనంతరం భారత్ 19.5 ఓవర్లలో4 వికెట్లకు 196 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు. ఈ విజయంతో గురువారం వాంఖడే వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

T20 World Cup 2026 Sanju Samson s Masterful 97 Guides India to Record Chase and Semi-Final Berth

నిరాశపర్చిన అభిషేక్, ఇషాన్

196 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులకే వెనుదిరగ్గా.. ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులకే ఔటయ్యాడు. దీంతో టీమిండియా 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంజూ శాంసన్ జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ 58 పరుగులు జోడించింది. సంజూ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రిథమ్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్‌(18)ను షమార్ జోసెఫ్ విడదీసాడు.

తిలక్ వర్మతో కలిసి సంజూ శాంసన్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆరంభం కాస్త టైమ్ తీసుకున్న తిలక్ వర్మ (27 పరుగులు; 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌) ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగాడు. 42 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని హోల్డర్ విడదీసాడు. తెలివైన బంతితో తిలక్‌ను క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు.

సంజూ సూపర్ ఫినిష్..

ఈ పరిస్థితుల్లో సంజూకు హార్దిక్ పాండ్యా అండగా నిలిచాడు. చివరి 12 బంతుల్లో భారత్ విజయానికి 17 పరుగులు అవసరమైన తరుణంలో షమార్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే వరుసగా రెండు బౌండరీలను బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా, సంజూ శాంసన్ వరుసగా ఒక సిక్స్, ఒక ఫోర్‌తో భారత విజయాన్ని పూర్తి చేశాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+