మనకు తెలియట్లేదు గానీ కివీస్ బ్యాడ్ ట్రాక్ రికార్డుంది భయ్యో
టీమిండియా మరో చారిత్రక ఘట్టానికి తెర తీయబోతోంది. టీ20 వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచివుంది. ఈ సాయంత్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. భారత్ గెలిస్తే- మూడోసారి టైటిల్ సాధించినట్టవుతుంది. న్యూజిలాండ్ గెలిస్తే, ఈ ట్రోఫీని గెలుచుకున్న ఏడో జట్టు అవుతుంది.
ఈ రెండూ కూడా ఐసీసీ టోర్నమెంట్ల మూడు ఫార్మాట్లు.. టెస్టులు, వన్డేలు, టీ20 ఫైనల్స్‌లో తలపడిన తొలి జట్లుగా చరిత్ర సృష్టించారు. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ప్రస్థానం ఆకట్టుకుంది. గ్రూప్ దశలో అన్ని నాలుగు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఎదురైనా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్, ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

న్యూజిలాండ్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. సూపర్ 8లో పాకిస్తాన్ మ్యాచ్ రద్దుకాగా, ఇంగ్లాండ్‌తో ఓటమిపాలైంది. శ్రీలంకపై భారీ విజయం సెమీఫైనల్ మార్గాన్ని సుగమం చేసింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాను 169/8కి కట్టడి చేయగా, ఒక్క వికెట్ కోల్పోయి ఈ స్కోర్ ను సులువుగా అందుకుంది. ఫైనల్‌కు ప్రవేశించింది.
మొత్తం 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి. టీమిండియా 18 విజయాలు (రెండు సూపర్ ఓవర్ గెలుపులతో సహా) నమోదు చేయగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ డీఎల్‌ఎస్ నిబంధనల ప్రకారం టైగా ముగిసింది. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం రికార్డు భిన్నంగా ఉంది. ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకు న్యూజిలాండ్‌ను ఓడించలేకపోయింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు న్యూజిలాండ్ చేతిలో టీమిండియా పరాజయం పాలైంది.
2007లో 10 పరుగులు, 2016లో 47 పరుగులు, 2021లో 8 వికెట్ల తేడాతో కివీస్ గెలిచింది. మొత్తంగా ఐసీసీ ఫైనల్స్‌లో భారత్-న్యూజిలాండ్ తలపడటం నాలుగోసారి. గత మూడు ఫైనల్స్‌లో న్యూజిలాండ్ రెండుసార్లు, భారత్ ఒకసారి గెలిచాయి. 2000 అక్టోబర్ 15 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్‌లో, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కివీస్ గెలువగా, గత సంవత్సరం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్లతో కివీస్‌ను ఓడించింది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications