Ind vs WI: విండీస్ బ్యాటర్లకు టీమిండియా బౌలర్ తండ్రి శాపనార్ధాలు..!

టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) సూపర్ 8 చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వరుస విజయాలతో సెమీస్ బెర్తుల్ని ఖరారు చేసుకున్నాయి. ఇక సూపర్ 8లోని రెండు గ్రూపుల నుంచి తలో జట్టు సెమీస్ కు చేరాల్సి ఉంది. వీటి కోసం గట్టి పోటీ నెలకొంది. తాజాగా జింబాబ్వేపై ఘన విజయంతో భారత్ తమ సెమీస్ అవకాశాల్ని మెరుగుపర్చుకుంది. ఇక మార్చి 1న జరిగే పోరులో విండీస్ ను ఓడిస్తే చాలు సెమీస్ కు చేరినట్లే.

ఈ నేపథ్యంలో విండీస్ బ్యాట్స్ మెన్ దూకుడుకు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేయగలిగితే చాలు మ్యాచ్ మనదే, సెమీస్ బెర్తూ మనదే అని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో విండీస్ బ్యాట్స్ మెన్ బౌండరీల వర్షంపై టీమిండియా పేసర్ అర్ష్ దీప్ సింగ్ (arshdeep singh) తండ్రి దర్శన్ సింగ్ తాజాగా శాపనార్ధాలు పెట్టాడన్న ఓ వార్త బయటికి వచ్చింది. హోటల్ రూమ్ లో కూర్చుని తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో విండీస్ బ్యాట్స్ మెన్ బౌండరీలు కొడుతుంటూ వాటిని చూసి తట్టుకోలేక అర్ష్ దీప్ తండ్రి ఇలా శాపనార్ధాలు పెట్టాడట.

Bowler Arshdeep Singh s Father Reportedly Hurled Abuse as West Indies Hit Boundaries

హోటల్ రూమ్ లో తమ కుటుంబం అంతా కూర్చుని దక్షిణాఫ్రికా, విండీస్ మ్యాచ్ చూశామని తాజాగా అర్ష్ దీప్ వెల్లడించాడు. ఈ సందర్భంగా విండీస్ బ్యాట్స్ మెన్ దక్షిణాఫ్రికా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడుతుంటే తన తండ్రి తిట్ల వర్షం అందుకున్నాడని, తాను జోక్యం చేసుకుని తన తండ్రిని శాంతింపజేసినట్లు అర్ష్ దీప్ వెల్లడించాడు. క్రికెట్ ను క్రికెట్ లా చూడమని, కేవలం దక్షిణాఫ్రికా గెలవాలని మాత్రమే ప్రార్థించమని తాను తండ్రికి చెప్పినట్లు టీమిండియా పేసర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో విండీస్ పై దక్షిణాఫ్రికా గెలుపుతో భారత్ సెమీస్ అవకాశాలు మెరుగుపడ్డాయి. అలాగే జింబాబ్వేతో విజయంతో ఊపుమీదున్న భారత్.. ఇక విండీస్ పై అదే ఊపు కొనసాగిస్తే సెమీస్ బెర్తు దక్కించుకోవడం ఖాయంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+