Ind Vs NZ: కివీస్ తో సిరీస్ కు స్టార్ ఆల్ రౌండర్ ఔట్, తెలుగు ప్లేయర్ కు పిలుపు...!!

India vs New Zealand: న్యూజీలాండ్ తో సిరీస్ వేళ టీమిండియాకు మరో షాక్. ఇప్పటికే స్టార్​ కీపర్ రిషభ్ పంత్​ సిరీస్ నుంచి దూరం కాగా, తాజాగా మరో స్టార్ ఆల్ రౌండర్ అదే బాట పట్టాడు. న్యూజీలాండ్ తో సిరీస్ లో తొలి మ్యాచ్ లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో భారత్ విజయం సాధించి ఆధిక్యతలో ఉంది. కాగా.. ఇప్పుడు వరుసగా ప్రధాన ఆటగాళ్ల గాయాల బారిన పడటం ప్రపంచ కప్ ముందు ఆందోళనగా మారుతోంది. ఇక.. ఈ ఆల్ రౌండర్ స్థానంలో తెలుగు ప్లేయర్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది.

న్యూజిలాండ్​ తో జరుగుతున్న వన్డే సిరీస్​ నుంచి భారత ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​ వైదొలి గాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో పక్కటెముకకు గాయం తగలడంతో సిరీస్​ నుంచి దూరమ య్యాడు. తొలి వన్డేలోనే వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచు లో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపిం చాడు.

Team India Key player ruled out of the remaining two ODIs against New Zealand

కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్‌ వేశాడు. సుందర్‌ సైడ్‌ స్ట్రైన్‌తో ఇబ్బంది పడుతున్నాడని, అతడు మ్యాచ్‌ అనంతరం స్కానింగ్‌కు వెళతాడని టీమిండియా కెప్టెన్ గిల్‌ వివరించాడు. కాగా, రెండో వన్డే రాజ్‌కోట్‌, మూడో వన్డే ఇండోర్‌లో జరుగనుంది. ప్రస్తుతం భారత్‌ ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే.. ఈ వన్డే సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో ఎవరికి స్థానం దక్కుతుందనేది కీలకంగా మారుతోంది.

ఇప్పటికే పంత్, తిలక్ వర్మ దూరం కాగా.. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ సమయానికి ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ఆందోళన టీంలో కనిపిస్తోంది. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ దూరం కావటంతో తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లోనూ వాషింగ్టన్ స్థానం లో నితీశ్ ను తీసుకోవటం ద్వారా సరైన ప్లేస్ మెంట్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇదే సమయంలో ఆల రౌండర్ షాబాజ్ అహ్మద్ వైపు చూస్తున్నట్లు మరో వాదన. అక్షర్ పటేల్ సిద్దం గా ఉన్నా... ప్రపంచ కప్ కారణంగా అక్షర్ ను ఎంపిక చేసే అవకాశం కనిపించటం లేదు. అయితే, వాషింగ్టన్ సుందర్ ఒక మ్యాచ్ కే దూరం అవుతారా.. లేక, సిరీస్ మొత్తానికి దూరం అవుతారా అనేది స్పష్టత రాగానే.. రీప్లేస్ మెంట్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యతలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+