Video: స్టెప్పులతో దుమ్మ రేపిన రోహిత్ సేన, చూసి తీరాల్సిందే- కింగ్ ఎక్కడ..!!

క్రికెట్ ఫీవర్ మొదలైంది. మరి కొద్ది గంటల్లో ప్రపంచ కప్ సమరం ఆరంభం కానుంది. బిగ్ టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల కెప్టెన్లు అహ్మాదాబాద్ చేరుకున్నారు. ఈ సారి స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావటంతో టీం ఇండియా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు రోహిత్ టీం సైతం అదే జోష్ మీద ఉంది. ఆరంభానికి ముందే రీల్స్ తో అభిమానుల్లో మరింత జోష్ పెంచుతోంది. గ్రౌండ్ లో ప్రత్యర్ధి టీంలతో సమరానికి సై అంటోంది.

క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం అవుతోంది. ఈ సారి టీం ఇండియా పేవరట్ గా బరిలోకి దిగుతోంది. ఆసీస్, కివీస్, ఇంగ్లాండ్, పాకిస్థాన్, సౌతాఫ్రికా వంటి జట్ల పైన అంచనాలు ఉన్నాయి. క్రికెట్ పండితులు సైతం టీమిండియా కప్ గెలిచే సామర్ధ్యం పైనే నమ్మకం ఉంచుతున్నారు. ఈ సమయంలో బీసీసీఐ రోహిత్ టీం చేసిన ఒక రీల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అందులో రోహిత్ తో పాటుగా కోహ్లీ, రాహుల్, సిరాజ్, అశ్విన్, షమీ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ సహా ఇతర సభ్యులు జవాన్ పాటకు రీల్స్ చేసారు. 360 డిగ్రీ కెమేరాతో చేసిన ఈ రీల్ ప్రపంచ కప్ ప్రారంభం వేళ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే, ఈ రీల్స్ లో కింగ్ కోహ్లీ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

Team india players shakes their leg for Sharukh starrer Jawan,video goes viral
ఇటు అహ్మదాబాద్ లో అన్ని జట్ల కెప్టెన్లు ప్రపంచ కప్ ప్రారంభ సెషన్ కు సిద్దమయ్యారు. టీమిండియా తొలి మ్యాచ్ ఈ నెల 8న ఆసీస్ తో చెన్నైలో తలపడనుంది. దీని కోసం ఈ మధ్నాహ్నం ఇండియా టీం చెన్నైకు చేరుకుంది. 11న ఆఫ్ఘనిస్తాన్ తో ఆడనుంది. ఇక, టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సస్ పాక్ దాయాది సమరానికి భారీ గ్రౌండ్..లక్ష మంది అభిమానుల సమక్షంలో ఈ నెల 14న అహ్మదాబాద్ లో జరగనుంది. ఈ మెగా ఫైట్ కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

19న బంగ్లాదేశ్, 22న న్యూజీలాండ్, 29న ఇంగ్లాండ్,నవంబర్ 2న శ్రీలంక, 5న సౌతాఫ్రికా, 12న నెదర్లాండ్స్ తో టీమిండియా తల పడనుంది. ఆ తరువాత సెమీస్ లోకి ఎంటర్ అయ్యే నాలుగు టీంలు రెండు సెమీస్..నవంబర్ 19న ఫైనల్ ఆడనున్నాయి. ప్రపంచ కప్ ఆరంభం వేళ కోట్లాది ఫ్యాన్స్ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+