నేటి నుంచే టీ20 వరల్డ్ కప్ మహా సంగ్రామం-3 మ్యాచ్‌లు టీమిండియాకు సవాల్: తుదిజట్టులో.. !!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మహాసంగ్రామం నేడు ప్రారంభం కాబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్త దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. మొత్తం 20 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆడనున్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం పోటీ పడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ దఫా కూడా టైటిల్‌ హాట్ ఫేవరెట్. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో భారత్ ఎదుర్కొన్న వివాదాలు.. ఆఫ్ ఫీల్డ్ వాతావరణాన్ని వేడెక్కించాయి.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ వివాదాల మధ్య..

భద్రతా ఆందోళనలు, స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్ కాంట్రాక్ట్ వివాదంతో భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరించింది. దీనికి మద్దతుగా పాకిస్తాన్ కూడా భారత్‌తో ఆడబోమని ప్రకటించింది. భారత్ తో మ్యాచ్‌లను బహిష్కరించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఫలితంగా లీగ్ దశలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లు దాదాపుగా జరగవు. సూపర్ 8 లో ఆ అవకాశం ఉండొచ్చు.

Team India will take USA in T20 World cup as its Opener of the Tournament in Wankhede today

నేడు మూడు మ్యాచ్‌లు..

వరల్డ కప్ మొదటి రోజులో భాగంగా నేడు మొత్తం మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ లో గ్రూప్-ఎలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తలపడతాయి. నిజానికి- ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగాల్సి ఉంది. టోర్నమెంట్ ను బహిష్కరించడం వల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతోంది.

అచ్చొచ్చిన పిచ్ పై టీమిండియా..

సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య గ్రూప్-ఎ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నిలిచింది. భారత జట్టు అత్యంత సమతుల్యంగా, బలంగా కనిపిస్తోంది. 2024లో జరిగిన చివరి ప్రపంచ కప్‌లో భారత్ ఈ ఫార్మాట్‌లో అమెరికాతో ఒక్కసారి మాత్రమే ఆడింది. న్యూయార్క్ లో జరిగిన మ్యాచ్ అది. అక్కడ మెన్ ఇన్ బ్లూ ఆ జట్టును ఓడించింది. మళ్లీ యూఎస్ తో తలపడటం ఇదే మొదటిసారి.

సవాల్ విసిరే జట్లు..

ఇతర ప్రధాన టీమ్ లల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. 2024లో ఛాంపియన్ గా నిలిచిన.. తన టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే ఈ జట్ల నుంచే సవాల్ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. కీలకమైన పేసర్ల కొరత ఆ జట్టును వేధిస్తోంది. ఇంగ్లాండ్ దూకుడు బ్యాటింగ్‌కు ఫేమస్. దక్షిణాఫ్రికా బౌలింగ్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. న్యూజిలాండ్ కు ఇక్కడి పిచ్ లు కొట్టిన పిండే. హోమ్ గ్రౌండ్ కావడం శ్రీలంకకు ప్లస్ పాయింట్.

ప్లేయింగ్ 11లో..

నేటి మ్యాచ్ లో ఆడే తుదిజట్టులో- ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ , సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్ (వైస్ కేప్టెన్), శివమ్ దూబే , జస్ ప్రీత్ బుమ్రా , అర్షదీప్ సింగ్ , వరుణ్ చకరవర్తి ఆడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+