భారత్ సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే - అగ్ని పరీక్షే..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరటం సాధ్యమేనా. సూపర్ -8 దశలో మ్యాచులు జరుగుతున్న కొద్దీ టీమిండియా సెమీస్ అవకాశాల పైన టెన్షన్ పెరుగుతోంది. సూపర్ -8 లో టీమిండియా మరో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. రెండు జట్ల పైన గెలవటం తో రేటుగా రన్ రేటు కీలకంగా మారుతోంది. రన్ రేటులో మైనస్ లో ఉన్న టీమిండియా ఇప్పుడు జింబాబ్వే మ్యాచ్ లోనే రన్ రేటు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంది. అయితే.. భారత్ సెమీస్ చేరాలంటే ఏం జరగాలి. లెక్కలు ఏం చెబుతున్నాయి..
టీ20 వరల్డ్ కప్ 2026 సెమీస్ పోరు ఆసక్తి కరంగా మారుతోంది. భారత్ సూపర్ 8 లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచులో ఓడిపోవడంతో సెమీస్ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. నెట్ రన్ రేట్ భారీగా దెబ్బతినడం టీమ్ఇండియాకు మైనస్ అయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అసలు టీమిండియా సెమీస్ చేరుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సూపర్ -8 పాయింట్ల పట్టికలో భారత్ 0 పాయింట్లతో గ్రూప్ 1లో మూడో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ కూడా -3.800 కు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు వెస్టిండీస్ (+5.350), సౌతాఫ్రికా (+3.800) నెట్ రన్ రేట్లో చాలా మెరుగ్గా ఉండి మొదటి రెండు స్థానాల్లో కొనసాగు తున్నాయి. దీంతో, సూర్య సేన వచ్చే రెండు మ్యాచుల్లో కేవలం గెలవడమే కాకుండా భారీ ఆధిక్యంతో విజయం సాధించాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నై వేదికగా జింబాబ్వేతో ఆడనుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచులో భారత్ కచ్చితంగా గెలవాలి. అదే విధంగా భారీ రన్ రేటుతో గెలిస్తేనే వెస్టిండీస్ తో జరిగే చివరి మ్యాచ్ గెలిచి సెమీస్ కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.

నెక్స్ట్ ఇలా జరిగితేనే సెమీస్ లో టీమిండియా
ప్రస్తుతం గ్రూపు -1 లో వెస్టిండీస్ జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. జింబాబ్వేపై సాధించిన భారీ విజయంతో 2 పాయింట్లను సాధించడమే కాకుండా +5.350తో నెట్ రన్ రేట్ సాధించింది. మార్చి 1న ఈడెన్ గార్డెన్స్ లో భారత్ తన చివరి సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ తో తలపడనుంది. భారత్ సెమీస్ చేరాలంటే రానున్న రెండు మ్యాచులు ఖచ్చితంగా గెవాలి. సౌతాఫ్రికా లేదా వెస్టిండీస్ తమ తదుపరి మ్యాచుల్లో ఒక్కటి ఓడినా భారత్ కు మార్గం క్లియర్ అవుతుంది. అదే విధంగా పాయింట్లు సమమైతే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్‌లో ఉన్నందున, జింబాబ్వేపై కనీసం 100 పరుగుల తేడాతో లేదా భారీ ఓవర్ల తేడాతో గెలవాల్సి ఉంటుంది. దీంతో.. ఒక విధంగా సెమీస్ చేరటం ఇప్పుడు భారత జట్టుకు అగ్ని పరీక్ష గా మారుతోంది. దీంతో, టీం ఇండియా వచ్చే రెండు మ్యాచుల్లో ఆట పైన ఫ్యాన్స్ లోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్












Click it and Unblock the Notifications