Champions Trophy 2025: ఇండియాలో జరిగే టోర్నమెంట్లలో పాక్ పాల్గొనదు..!
ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి టీమిండియా పాకిస్థాన్ వెళ్లదని భారత విదేశంగా స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీ కూడా ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని పాకిస్థాన్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో పాక్ హైబ్రిడ్ మోడల్ ను ఒప్పుకోక తప్పలేదు. ఇన్ని రోజులు భారత్ పాక్ రావాల్సిందేనన్న పీసీబీ.. తాజాగా మనసు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే హైబ్రిడ్ మోడల్ లో మ్యాచ్ లు నిర్వహిస్తే తమకు ఆర్థిక సాయం చేయాలని పాక్ డిమాండ్ చేసినట్లు తెలిసిందే. అంతే కాదు.. భారత తమ దేశంలో పర్యటించడం లేదు.. కాబట్టి భవిష్యత్ లో ఇండియాలో జరిగే ఐసీసీ ఈవెంట్లలో తాము కూడా పాల్గొనబోమని చెప్పింది.
అప్పుడు కూడా హైబ్రిడ్ మోడల్ లోనే మ్యాచ్ లు నిర్వహించాలని ఐసీసీ హామీ ఇవ్వాలని కోరినట్లు తెలిసిందే. కాగా 2031 వరకు భారత్ మూడు పురుషుల ఐసీసీ ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 T20 ప్రపంచ కప్‌ను శ్రీలంకతో కలిసి సంయుక్తంగా నిర్వహించనుంది. బంగ్లాదేశ్‌తో కలిసి 2029 ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనుంది. 2031 ODI ప్రపంచకప్ ను కూడా బంగ్లాదేశ్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించనుంది.

ఆర్థిక సాయం పై సానుకూలంగా ఉన్న ఐసీసీ.. రెండో డిమాండ్ కు మాత్రం నో చెప్పినట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించే అంశంపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ టోర్నమెంటన్ హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తే ఫైనల్ మ్యాచ్‌ను లాహోర్‌లో నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ చేరకపోతే ఈ టోర్నీ ఫైనల్ లాహోర్ లోనే జరగాలని పట్టుబడుతున్నట్లు సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ జరిగితే భారత్ మ్యాచ్ లు UAEలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం భారత్ vs పాకిస్థాన్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్మార్చి 1న జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంకు బదులుగా దుబాయ్‌లో నిర్వహించ అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హైబ్రిడ్ మోడల్ ప్రకటన నేడు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications