IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన 5 జట్లు ఇవే..
IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం గురించి అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ లో అత్యధిక పరాజయాలను నమోదు చేసిన 5 జట్ల గురించి తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ జట్టు 252 మ్యాచ్ లలో 134 ఓడిపోయి అత్యధిక మ్యాచ్‌లలో పరాజయం చవిచూసిన టీమ్ గా చెత్త రికార్డును మూటగట్టుకుంది. 4 మ్యాచ్‌లు టైగా ముగియగా.. 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.

పంజాబ్ కింగ్స్
ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో పంజాబ్ మొత్తం 246 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 133 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఇది కాకుండా 4 మ్యాచ్‌లు టైగా ముగిశాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ.. మొత్తం 256 మ్యాచ్ లు ఆడి 128 మ్యాచ్ లలో పరాజయాన్ని చవిచూసింది. 3 మ్యాచ్ లు టై కాగా.. 4 మ్యాచ్ లు ఫలితం తేలలేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్
కోల్‌కతా నైట్ రైడర్స్ అంటే కేకేఆర్ 252 మ్యాచ్‌లలో 117 మ్యాచ్ లు ఓడిపోయింది. కోల్‌కతా జట్టు 4 మ్యాచ్ లు టైగా ముగియగా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
ముంబై ఇండియన్స్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ ఐదో స్థానంలో ఉంది. ఆడిన 261 మ్యాచ్ లలో 115 మ్యాచ్ లలో వారు ఓటమి పాలయ్యారు. కాగా ముంబై ఇండియన్స్ 4 మ్యాచ్ లు టై అయ్యాయి.
రాజస్థాన్ రాయల్స్ 106 మ్యాచ్ లలో ఓడిపోయి ఆరో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 98 మ్యాచ్ లలో మాత్రమే పరాజయాన్ని చవిచూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 91 మ్యాచ్ లలో ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ 19 మ్యాచ్ లలో, గుజరాత్ టైటాన్స్ 17 మ్యాచ్ లలో ఓడిపోయాయి.












Click it and Unblock the Notifications