IND Vs NZ Semis: గెలుపెవరిదో ముందే డిసైడ్ - వాంఖడేలో అదే కీలకం.!!

ప్రపంచ కప్ సమరం నేడు బిగ్ డే. కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠ గా ఎదురు చూస్తున్న మ్యాచ్ కు రంగం సిద్దమైంది. ఇండియా వర్సస్ న్యూజీలాండ్ మధ్య సెమీస్ సమరం సాగనుంది. ఇప్పటికే క్రికెట్ నిపుణులు..ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో భారత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రోహిత్ సేన విజయ పరంపర కొనసాగుతుందని ఆకాంక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఈ మ్యాచ్ లో ప్రతీ అడుగు కీలకంగా మారుతోంది. మ్యాచ్ ప్రారంభ వేళ టాస్ గెలిచిన టీం సగం మ్యాచ్ గెలిచినట్లే.

ఇండియా వర్సస్ న్యూజీలాండ్ మధ్య ఈ రోజు వాంఖడేలో జరిగే సెమీస్ లో టాస్ కీలక పాత్ర పోషించనుంది. ఇక్కడ టాస్ ఏ టీం గెలిస్తే ఆ జట్లు సగం మ్యాచ్ గెలిచినట్లేననే క్రికెట్ లెజండరీలు విశ్లేషిస్తున్నారు. సహజంగా ఇక్కడి గ్రౌండ్ పరిస్థితుల్లో ఏ టీం టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ కు ప్రాధాన్యత ఇవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఈ గ్రౌండ్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. భారత్ వర్సస్ శ్రీలంక మద్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ చేతిలో 302 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక, ఇక్కడ బౌండరీ చిన్నదిగా ఉండటంతో రెండు టీంల్లోని బ్యాటర్లు తమ భారీ షాట్లకు మరింత పదును పెట్టటం ఖాయంగా కనిపిస్తోంది.

Toss can become deciding factor at World Cup 2023 semi-finals India Vs New Zealand

ఇక్కడ ఎవరైనా అవలీలగా ఫోర్లు, సిక్స్ లు కొట్టేందుకు వీలుగా ఉంటుందని పిక్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ద్వారా భారీ స్కోరు నమోదు చేస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని సీనియర్ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. బ్యాటింగ్ కు ఈ పిచ్ ఎంతగా సహకరిస్తుందో..సెకాండఫ్ లో పేస్ బౌలింగ్ కు అంతగానే సహకరిస్తుంది. శ్రీలంక పైన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగులు చేసి, శ్రీలంక ను 55 పరుగులకే భారత్ బౌలర్లు కుప్ప కూల్చారు. ఇదే సమయంలో నేటి మ్యాచ్ లో వర్షానికి అవకాశం లేదని తెలుస్తోంది. ఒక వేళ వర్షం అంతరాయం కలిగించినా రిజర్వ్ డే ఉంది. దీంతో, ఈ రోజు మ్యాచ్ పైన ఇప్పటికే భారత్ పైన అంచనాలు పెరుగుతున్నాయి. ఇక, టాస్ ఎవరు గెలిస్తే వారిదే మ్యాచ్ అనే విశ్లేషణలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+