మైదానంలో విషాదం..మ్యాచ్ ఆడుతూ గుండెపోటుతో క్రికెటర్ మృతి..
క్రికెట్ మైదానంలో విషాదం నెలకొంది. మ్యాచ్ ఆడుతూ ఓ యువ క్రికెటర్ గుండెపోటుతో మృతిచెందాడు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఇమ్రాన్ పటేల్ అనే 35ఏళ్ల క్రికెటర్ గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాష్ట్రంలోని గార్వేర్ స్టేడియంలో చిన్న లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ కూడా ఈ లీగ్ మ్యాచ్లో పాల్గొన్నాడు. మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఇమ్రాన్ పటేల్ ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఇమ్రాన్ పటేల్ ఓపెనింగ్‌కు దిగాడు. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ కూడా చేశాడట. బ్యాటింగ్కు దిగిన ప్రతిసారి చాతిలో నొప్పిగా ఉందని ఎంపైర్లకు చెబుతూ వస్తున్నాడు. మ్యాచ్‌లో ఐదు ఓవర్లు పూర్తి అయ్యాక చెస్ట్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ లో తీవ్రమైన నొప్పిగా ఉందని ఎంపైర్లకు చెప్పాడు. అనంతరం పెవిలియన్ కు వెళ్తూ గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలాడు.

భార్య, ముగ్గురు కూతుళ్లు..
వెంటనే మ్యాచ్ నిర్వాహకులు అతన్ని అక్కడే ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ కు భార్య అలాగే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంతో పాటు మహారాష్ట్ర క్రికెట్ లో తీవ్ర విషాదం నెలకొంది.
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024












Click it and Unblock the Notifications