వన్డే సిరీస్‌లో ఫ్లాప్ - ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్ల సంచలన నిర్ణయం..!!
న్యూజీలాండ్ తో వన్డే సిరీస్ టీమిండియా కోల్పోయింది. మూడో వన్డే.. సిరీస్ డిసైడర్ అయిన చివరి మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేసినా గెలుపు దక్కలేదు. బౌలింగ్.. ఫీల్డింగ్ లోపాలు బయటపడ్డాయి. ఈ సిరీస్ తరువాత టీం సభ్యుల కంటే కోచ్ గంభీర్ క్రికెట్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో కివీస్ సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.
కివీస్ తో సిరీస్ కోల్పోవటంతో టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు తమ తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ఈ సిరీస్ లో ఫాం లో లేక పూర్తిగా ఆత్మరక్షణలో కనిపించిన శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్దమయ్యారు. తమ రాష్ట్రాల జట్ల నుంచి ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడేందుకు సిద్దమయ్యారు.

స్వదేశీ గడ్డ పై న్యూజీలాండ్ తో సిరీస్ కోల్పోవటం టీం ఇండియాకు కష్టంగా మారింది. ఈ సిరీస్‌లో ఏ స్థాయిలోనూ రాణించలేకపోయిన శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, తమ ఫామ్‌ను తిరిగి పొందేందుకు దేశవాలీ క్రికెట్ ఆడేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నెల 22 నుంచి రాజం కోట్ లో పంజాబ్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌లో వీరు తమ టీంలకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తరువాత సహజమైన ఆటకు దూరమయ్యారు. గతంలో సులభం గా షాట్స్ కొట్టిన గిల్ కెప్టెన్ అయిన తరువాత ఆ ఒత్తిడితో ఆడుతున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, కీలకమైన డిసైడర్ మ్యాచ్ లో మాత్రం తన ఆటతో పాటుగా జట్టును నడిపించటంలో విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు గిల్ పంజాబ్ తరపున రంజీలో ఆడేందుకు సిద్దమయ్యాడు. అదే విధంగా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం రంజీ ఆడేందుకు మైదానంలోకి దుగుతున్నారు.

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్ లో జడేజా కేవలం 43 పరుగులు చేయగా.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం మైనస్ గా మారింది. 37 ఏళ్ల వయసులో ఉన్న జడేజా ఫామ్ ఇలాగే కొనసాగితే అతని కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. దీంతో.. తన సొంత గడ్డ రాజ్ కోట్ లో రంజీ మ్యాచ్ లో పంజాబ్ తో తల పడేందుకు సిద్దం అవుతున్నారు. రానున్న రోజుల్లో జరిగే టెస్టు సిరీస్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలెక్టర్లు దేశవాలీ మ్యాచ్ లను ఆసక్తిగా గమనిస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications