World Cup 2023: కోహ్లీ మేనియా, అమిత్ షా హాజరు - ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..!!

ప్రపంచ కప్ క్రికెట్ సమరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా 6 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్ సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ నెల 5న కోల్ కతా వేదిక గా ఇండియా వర్సస్ సౌతాఫ్రికా బిగ్ మ్యాచ్ జరగనుంది. అదే రోజు మరో ప్రత్యేకత ఉంది. కింగ్ కోహ్లీ బర్త్ డే అదే రోజు. భారీగా ఫ్యాన్స్ మధ్య సెలబ్రేట్ చేయటానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక అతిధిగా హాజరవుతున్నారు.

కోహ్లీ బర్త్ డే స్పెషల్: ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఆదివారం (నవంబర్ 5)న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ జట్ల మ్యాచ్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. రేపు (నవంబర్) భారత జట్టు శ్రీలంకతో తలపడనుంది.భారత్, శ్రీలంక జట్లు 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగానే జరిగింది.

Union Home Minister Amit Shah will attend India vs South Africa match to be held on November 5 at Kolkata

2న జరగబోయే మ్యాచ్ కూడా వాంఖడేలోనే జరగనుండడంతో ఈ మ్యాచ్ ప్రత్యక్షంగ వీక్షించేందుకు భారీగా ఫ్యాన్స్ తరలి వస్తున్నారు. ఇక పాయింట్ల పట్టికలో టీమిండియా వర్సస్ సౌతాఫ్రికా మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ మ్యాచ్ రోజునే కోహ్లీ జన్మదినం కావటంతో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

కోల్ కతాలో కోహ్లీ మేనియా : మ్యాచ్‌ జరిగే కోల్‌కతా నగరంలో కింగ్‌ కోహ్లీ పేరు మార్మోగుతోంది. మరో వైపు కోహ్లీ బర్త్‌ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు క్యాబ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ కోసం స్టేడియానికి వచ్చే ప్రతి ఒక్కరికీ విరాట్ కోహ్లీ ఫేస్‌ మాస్కులు ఇచ్చేలా ప్లాన్ చేశారు. అలా సుమారు 70,000 కోహ్లీ ఫేస్‌ మాస్క్‌లను పంపిణీ చేయాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది.

దీంతో స్టేడియం మొత్తం కోహ్లీతో నిండిపోతుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, బర్త్ డే కేక్ కటింగ్ ఈవెంట్ కూడా జరగనుంది. ఈ సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ విరాట్ కోహ్లీకి జ్ఞాపికను ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. అలాగే ఇన్నింగ్స్‌ విరామ సమయంలో విరాట్‌కు బర్త్‌ డే విషెస్‌ చెబుతూ భారీగా టపాసలతో సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ గాయని శిల్పా రావు సంగీత ప్రదర్శన కూడా ఉండనుంది.

Union Home Minister Amit Shah will attend India vs South Africa match to be held on November 5 at Kolkata

అమిత్ షా హాజరు..సెలబ్రేషన్స్ : భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ కోరింది. ఇందుకు ఆయన అంగీకరించారు. దీంతో ఆయన నేరుగా మైదానానికి వచ్చి భారత జట్టుకు మద్దతు తెలపనున్నారు.

పాకిస్థాన్ తో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ కు షా హాజరయ్యారు. కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే సచిన్ రికార్డు సమం చేస్తాడు, తన జన్మదినం నాడు..సౌతాఫ్రికా పైన కోల్ కతా వేదికగా ఈ ఘనత సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. దీంతో, కోల్ కతా నగరం మొత్తం కోహ్లీ మేనియా తో ఊగిపోతోంది. కోహ్లీ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+