Ind-Pak Match: ఒక్క మ్యాచ్ విలువ 4500 కోట్లా? తేడా వస్తే వరల్డ్ కప్ సహా వీళ్లంతా బలి..!
వచ్చే వారం టీ20 వరల్డ్ కప్ (T20 world cup 2026) ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫ్యాన్స్ అయితే ఎప్పుడు టోర్నీ ప్రారంభమవుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ జట్టు (pakistan) ఈ టోర్నీలో ఆడతాం కానీ భారత్ (india) తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ మాత్రం ఆడబోమని తాజాగా ప్రకటించింది. చూసేందుకు సింపుల్ గా కనిపిస్తున్న ఈ ప్రకటన విలువ ఇప్పుడు రూ.4500 కోట్లని అంచనా వేశారు.
పాక్ షాకింగ్ ప్రకటన (pakistan)
ఇప్పటికే ఈ టోర్నీలో భాగంగా భారత్ లో జరిగే మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించి మొత్తం టోర్నీనుంచే తప్పుకున్న బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ మొదలుపెట్టిన ప్రమాదకరమైన ఆట నిన్న పరాకాష్టకు చేరింది. టోర్నీలో మిగతా మ్యాచ్ లు ఆడతామని, అయితే భారత్ తో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే ఇలాంటి మెగా టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు మజా, ఐసీసీ సహా క్రికెట్ బోర్డులకు లాభాల పంట, బ్రాడ్ కాస్టర్లకు పండగ ఇలా చాలా మందికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

రూ.4500 కోట్ల విలువైన మ్యాచ్
భారత్-పాకిస్తాన్ ఫిబ్రవరి 15న ఆడబోతున్న మ్యాచ్ విలువ రూ.4500 కోట్లుగా లెక్క తేల్చారు. ఇందులో ప్రసార హక్కులు, ప్రకటనల ప్రీమియాలు, స్పాన్సర్‌షిప్ యాక్టివేషన్లు, ప్రేక్షకుల టికెట్లు, చట్టబద్ధమైన బెట్టింగ్ వంటి వాణిజ్య కార్యకలాపాలు, ఇలా చాలానే ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ కు దరిదాపుల్లో ఏ మ్యాచ్ కూడా ఉండదు. చివరికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా దీనికి సమానం కాదు. ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్టర్లకు అయితే సెకనుకు ప్రకటన ఖర్చు 25-40 లక్షలు ఉంటుందంటే ఇదెంత ఖరీదైన మ్యాచ్ అనేది అర్దమవుతుంది. అందుకే ఈ మ్యాచ్ జరగకపోతే టీ20 వరల్డ్ కప్ కాస్తా తలకిందులవుతుంది.

ఎవరికెంత నష్టం ?
భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే నష్టపోయే వారి జాబితా భారీగానే ఉంది. ఇందులో ఒక్క బ్రాడ్ కాస్టర్ మాత్రమే ప్రకటనల ఆదాయం రూ.300 కోట్లు కోల్పోతారు. అందుకే జియో హాట్ స్టార్ ఐసీసీని పరిహారం చేయాలని కోరుతోంది. అదే జరిగితే ఆ భారం తిరిగి ఐసీసీ బాధ్యులైన బోర్డులపైనే మోపుతుంది. అలాగే ఈ మ్యాచ్ జరగకపోతే రెండు బోర్డులు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ.200 కోట్ల ఆదాయాన్ని వెంటనే కోల్పోతాయి. పాకిస్తాన్ బోర్డు అయితే ఏటా ఐసీసీ నుంచి అందే 34.51 మిలియన్ డాలర్ల నిధులు కోల్పోతుంది. అన్నింటికంటే మించి పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోతుంది. చివరిగా ఈ మ్యాచ్ కోసం విమానాలు, హోటల్స్, ఇతర సౌకర్యాలు అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న ఫ్యాన్స్ కూడా నష్టపోతారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications