Vaibhav Sooryavanshi: ఒకే ఓవర్లో 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీ రచ్చ! (వీడియో)
Vaibhav Sooryavanshi: బెంగళూరు వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన బౌలింగ్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును తీవ్ర కష్టాల్లోకి నెట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీనికి సమాధానంగా ఈస్ట్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగుల భారీ స్కోరు సాధించింది. దాంతో భారీ ఆధిక్యాన్ని సాధించిన ఈస్ట్ జోన్ ప్రత్యర్థి జట్టును ఫాలో-ఆన్ ఆడించింది. ఫాలో-ఆన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుసగా వికెట్లు కోల్పోతూ మళ్లీ విఫలమైంది.

నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ సమయంలో లెఫ్టార్మ్ స్లో ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన వైభవ్ సూర్యవంశీ 27వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చాడు. అదే ఓవర్ రెండో బంతికి 25 పరుగులు చేసిన కిషన్ లింగ్డోను క్యాచ్ ఔట్ చేయగా.. ఐదో బంతికి ఇమ్లివాతి లెమ్‌టూర్‌ను(4 పరుగులు) పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మొత్తం 3 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం గమనార్హం. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ లో వైభవ్ సూర్యవంశీ 6 బంతుల్లో 2 ఫోర్లతో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయినప్పటికీ బౌలింగ్‌లో మెరిసి జట్టుకు మంచి విజయావకాశాలను అందించాడు. ప్రత్యర్థి జట్టు నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ విజయం ముంగిట నిలిచింది.
Vaibhav Sooryavanshi is now taking wickets too! pic.twitter.com/17IiOuZu9q
— Cricbuzz (@cricbuzz) August 25, 2026












Click it and Unblock the Notifications