Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వినేష్ ఫొగట్‌‌‌‌ ఫైనల్స్ వెళ్లడం ఎవరికో నచ్చలేదు: భారీ కుట్ర- బాక్సర్ విజేందర్ సింగ్ సంచలనం

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరిన వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. ఇంకాసేపట్లో ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డిస్ క్వాలిఫై అయ్యారు.

ఫైనల్స్‌ ఆడటానికి కొద్దిసేపటి ముందు షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. వినేష్ ఫొగట్‌ డిస్‌‌క్వాలిఫై అయ్యారని భారత ఒలింపిక్స్ కమిటీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఓవర్ వెయిట్ అంటే.. అధిక బరువు కారణంగా వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. నిర్దేశిత బరువు కంటే కొన్ని గ్రాములు అధికంగా ఉండటం అనర్హత వేటుకు కారణమైంది.

Vinesh Phogat disqualification Boxer Vijender calls huge conspiracy against India

మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఆమె పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇందులోనే ఆమె ఫైనల్స్‌లో అడుగుపెట్టగలిగారు. పతకాన్ని ఖాయం చేసుకోగలిగారు. ఫైనల్స్ ఓడినా వెండి పతకం మాత్రం ఖాయం. ఈ పరిస్థితుల్లో అధిక బరువు కారణంగా ఆమె అనర్హత వేటుకు గుర్యారు.

ఈ కేటగిరిలో ఆడే రెజ్లర్ 50 కేజీలు, లేదా అంతకంటే తక్కువ శరీర బరువును కలిగి ఉండాలి. నిబంధనల మేరకు ఓ 100 గ్రాముల వరకు అధిక బరువును కలిగి ఉండొచ్చు. వినేష్ ఫొగట్ మాత్రం 50 కేజీలకు మించి బరువును కలిగి ఉన్నారని, అదే అనర్హత వేటుకు కారణమైందని ఒలింపిక్స్ కమిటీ వెల్లడించింది.

మంగళవారం రాత్రి ఆమె రెండు కేజీల వరకు బరువు పెరిగినట్లు సమాచారం. మొత్తంగా 52 కేజీల బరువును కలిగి ఉన్నారని చెబుతున్నారు. దీన్ని 50 కేజీల లోపు వరకు తగ్గించుకోవడానికి మంగళవారం రాత్రంతా నిద్రాహారాలు సైతం మానివేశారు. అయినప్పటికీ బరువు తగ్గలేదు. దీనితో ఆమెపై అనర్హత వేటు వేశారు.

ఈ వ్యవహారంపై భారత బాక్సర్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై చోటు చేసుకున్న భారీ కుట్రగా అభివర్ణించాడు. వినేష్ ఫొగట్ ఒలింపిక్స్ ఫైనల్స్ వరకు చేరడం, పతకాన్ని ఖాయం చేసుకోవడాన్ని కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 100 గ్రాముల బరువు పెరగడం వల్ల వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు.

ఆమె ఫైనల్స్ వరకు చేరుకోవడం ఎవరికో ఏదో సమస్య వచ్చినట్టుగా భావిస్తున్నానని, అందుకే కుట్ర పన్ని బౌట్ ఆడకుండా అనర్హత వేటు పడేలా చేశారంటూ అనుమానాలను వ్యక్తం చేశారు. 100 గ్రాముల బరువును తగ్గించుకోవడానికి వినేష్ ఫొగట్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.

అథ్లెట్లకు కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు అవసరం లేదని, బరువును కోల్పోవడం, దాన్ని రికవరీ చేసుకోవడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని విజేందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

మరుసటి రోజు మనకు బౌట్ ఉందని తెలిసినప్పుడు బరువు అదుపులో ఉంచుకోవడంపై దృష్టి పెడతామని అన్నారు. బరువును రికవరీ చేసుకునే విషయంలో తాము ఫిజియోపై ఆధారపడతామని, ఆకలికి తట్టుకోగలుగుతామని చెప్పారు. ఆహారం తీసుకోవడం కంటే రికవరీకే అధిక ప్రాధాన్యత ఇస్తామని విజేందర్ సింగ్ వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+