మరో షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. ఏకంగా దానికి కూడా గుడ్ బై..?
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించారు. కోహ్లీ రిటైర్ ఇస్తారని ఎవరూ భావించలేదు. అయితే బీసీసీఐతో విభేదాల వలనే కోహ్లీ రిటైర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లీ, తాజాగా టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేశారు. కేవలం వన్డేల్లో మాత్రమే కోహ్లీ కనిపించనున్నాడు. ఇక రిటైర్మెంట్ అనంతరం విరాట్,అనుష్క దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
తమ జీవితంలోని రెండో ఇన్నింగ్స్‌ను లండన్ నగరంలో ప్రారంభించాలని చూస్తున్నారనే ఊహాగానాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.భారతదేశంలో విపరీతమైన అభిమానుల తాకిడికి గురయ్యే ఈ జంట, తమ పిల్లలైన వామిక , అకాయ్‌లకు ప్రశాంతమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నారట. లండన్‌లో ఇప్పటికే వారికి ఒక ఇల్లు ఉందని, రిటైర్మెంట్ తర్వాత అక్కడే శాశ్వతంగా నివసించాలని భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

మైదానంలో తన దూకుడుతో అందరినీ ఆకట్టుకున్న విరాట్, రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాడు. అనుష్క శర్మ కూడా తన సినీ కెరీర్‌కు కొంత విరామం ఇచ్చి, పిల్లల పెంపకంలో నిమగ్నమై ఉన్నారు. లండన్ నగరం వారికి కావలసిన ప్రైవసీని మరియు ప్రశాంతతను అందిస్తుందని వారు భావిస్తున్నారు. అక్కడ తమ పిల్లలు సాధారణ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని వారు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications