బీసీసీఐపై కోహ్లీ తిరుగుబాటు..అతన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు..?
భారత క్రికెట్ బోర్డుపై స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విమర్శలు గుప్పించాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆటగాళ్లు పర్యటనలో ఉన్నప్పుడు వెంట కుటుంబాలను తీసుకెళ్లకూడదని నిర్ణయాన్ని బీసీసీఐ తెర మీదకు తెచ్చింది .బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ఆడే సమయంలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని , అలాంటి సమయంలో ఆటగాళ్లకు కుటుంబం మద్దతుగా ఉండటం ఎంత కీలకమో కోహ్లీ వివరించాడు.
టూర్‌ల సమయంలో కుటుంబ సభ్యులు ఉండటం వల్ల ఆటగాళ్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లు గెలిపించాల్సిన బాధ్యత ఆటగాళ్లపై ఉన్నప్పుడు మానసిక స్థిరత్వం ఎంతో అవసరం. అలాంటప్పుడు కుటుంబంతో గడిపే సమయం వారిని మానసికంగా ధృఢంగా మారుస్తోందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు ఒంటరిగా ఉండకుండా, వారి కుటుంబ సభ్యుల సహాయంతో గడపడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కుంటారని కోహ్లీ వెల్లడించాడు.

టూర్‌ల సమయంలో కుటుంబ సభ్యుల హాజరుకు పరిమితులు పెట్టడాన్ని కోహ్లీ తప్పుపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో 1-3 తేడాతో ఓటమి తర్వాత బీసీసీఐ కొత్త నిబంధనను తెర మీదకు తెచ్చింది. ఈ నిబంధనల ప్రకారం, 45 రోజులకంటే ఎక్కువ కాలం సాగే టూర్లకు మాత్రమే కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చింది. అది కూడా రెండు వారాలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధన పెట్టింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు.












Click it and Unblock the Notifications