విశ్రాంతి ఇవ్వండి - బీసీసీఐకి విరాట్ రిక్వెస్ట్, రోహిత్ సైతం..!!
ప్రపంచకప్ పైనల్ తరువాత టీమిండియాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ కప్ లో వరుసగా 10 మ్యాచ్ ల్లో విజయం సాధించిన టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని కోట్లాది మంది ఆశించారు. ఫైనల్స్ లో ఓడినా టీమిండియాకు అందరూ బాసటగా నిలిచారు. ఇక, ఆ ఓటమి బాధను మర్చిపోయి భవిష్యత్ మ్యాచ్ లకు టీంను బీసీసీఐ సమాయత్తం చేస్తోంది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన తాజా అభ్యర్దన సంచలనంగా మారుతోంది.
టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. ఈ పర్యటన వేళ తనకు వైట్ బాల్ క్రికెట్ నుంచి విశ్రాంతి కావాలని విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరారు. దీంతో, దక్షిణాఫ్రికా పర్యటకు ఇప్పటికే రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాల నడుమ విరాట్ ఆడటం లేదనేది స్పష్టత వస్తోంది. ప్రపంచ కప్ లో రోహిత్, విరాట్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ 11 ఇన్నింగ్స్ లో 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు. ఫైనల్స్ ఓడటంతో కన్నీటి పర్యంతమైన కోహ్లీ, రోహిత్ తో సహా టీం సభ్యులను ప్రధాని ఓదార్చారు. ప్రముఖులు, ఫ్యాన్స్ మద్దతుగా నిలిచారు.

ఇక, ఈ డిసెంబరు 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భారత్ 3 టీ20 ఇంటర్నేషనల్‌లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇది కాకుండా, ఈ పర్యటనలో 2 టెస్టులు కూడా ఆడనున్నాయి. ఒకటి డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్‌లో, మరొకటి జనవరి 3 నుంచి కేప్ టౌన్‌లో జరగనుంది. ఈ పర్యటనకు ముందు ప్రస్తుతం రోహిత్, కోహ్లీ ఇద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా విరాట్ బీసీసీఐకు లేఖ రాయటంతో కోహ్లీ ఈ టూర్ లో వన్డేలు, టీ20లకు ఇక అందుబాటులో లేనట్లే. ఇటు అజిత్ అగార్కర్ నాయకత్వంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ రానున్న మ్యాచ్ లకు జట్టు ఎంపిక చేయనుంది.
కొద్ది నెలల క్రితం ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆసీస్ తో జరిగిన మ్యాచ్ వేళ ఈ ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. ప్రపంచ కప్ వేళ వీరి పైన ఒత్తిడి లేకుండా ఉంచేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు. అంచనాలకు తగినట్లుగానే ఈ ఇద్దరు ప్రపంచ కప్ లో రాణించారు. అయితే, ఇప్పుడు సౌతాఫ్రికాలో జరిగే బైట్ బాల్ బ్యాచ్ లకు దూరంగా ఉంటానని కోహ్లీ అభ్యర్దించటం.. రోహిత్ ఆడటం పైన సందేహలతో ఈ ఇద్దరు కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనలో ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications