World Cup 2023: షమీతో ఇక కష్టమే -సెమీస్ వేళ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు..!!

ప్రపంచ కప్ సమరంలో అసలైన యుద్ద మొదలైది. అగ్రశ్రేణి నాలుగు జట్లు సెమీస్ చేరాయి. వచ్చే వారం జరిగే రెండు సీమస్ ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచుతున్నాయి. భారత్ వర్సస్ న్యూజీలాండ్ , అదే విధంగా ఆస్ట్రేలియా వర్సస్ సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ల్లో ఎవరు గెలుస్తారనే దాని కంటే అసలైన క్రికెట్ మజా పంచటం ఖాయం. ఈ సమయంలోనే భారత్ పేస్ త్రయం..అందునా ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్ప తిప్పులు పెడుతున్న మహ్మద్ షమీ గురించి పాక్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రం ఆసక్తికర విశ్లేషణ చేసారు.

ఆ ముగ్గురూ కీలకమే:ప్రపంచ కప్ భారత్ లో అగ్రస్థానంలో ఉంది. సెమీస్ లో కివీస్ తో తల పడటం ఖాయమైంది. లీగ్ దశలో కివీస్ పైన భారత్ విజయం సాధించినా..న్యూజీలాండ్ టీంను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. అందునా ముంబాయి గ్రౌండ్ లో మ్యాచ్ జరగనుండటం మరింత ఆసక్తి పెంచుతోంది. భారత్ బ్యాటర్లు మంచి ఫాంలో ఉండగా..అంతకు మించి అన్నట్లుగా పేస్ త్రయం బంతితో విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ సమయంలో భారత్ బౌలింగ్ పైన వసీం అక్రమ్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసారు. ఏ జట్టు అయినా భారత్ బౌలర్లను ఎదుర్కోవటం కష్టమని చెప్పారు. అందునా మహ్మద్ షమీ బౌలింగ్ గురించి అక్రం చేసిన అనాలసిస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Wasim Akram has shared his views about the outstanding run of Indian bowlers at the World Cup

షమీతో కష్టమే:ప్రపంచ కప్ లో షమీ ఇప్పటి వరకు 16 వికెట్లు తీసాడు. రెండు సార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేసాడు. షమీ తన బౌలింగ్ లో వికెట్ కు రెండు వైపులా స్వింగ్ చేయటం..పిచ్ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం షమీ స్పెషల్ గా అక్రం పేర్కొన్నారు. భారత బౌలర్లు ఎంతో కాలంగా పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కుతుందన్నారు. షమీ వేసిన ప్రతీ బంతీ వికెట్ తీసే విధంగా ఉందని చెప్పుకొచ్చారు. బంతిని ఎటు పడితే అటు కాకుండా వికెట్లను లక్ష్యంగా చేసుకొని పిచ్ పై బలంగా వేయటం వల్ల బ్యాటర్లకు కష్టంగా మారుతుందని విశ్లేషించారు. తన సీమ్ బౌలింగ్ తో షమీ ప్రత్యర్ధులను హడలెత్తిస్తున్నారన్నారు. షమీ తన బౌలింగ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.

కివీస్ ను ఎదుర్కోవాంటే:బెన్ స్టోక్స్ ను వరుసగా ఔట్ స్వింగర్లతో ఇబ్బంది పెట్టి ఒక్క సారి ఇన్ స్వింగర్ తో క్లీన్ బౌల్డ్ చేసాడని చెప్పుకొచ్చారు. షమీ వేసిన బంతికి బెన్ దగ్గర సమాధానమే లేదన్నారు. అరౌండ్ ది వికెట్ తీసుకొని లెంగ్త్ తప్పకుండా బంతిని సీమ్ చేసాడని గుర్తు చేసారు. అంతకు ముందు పడిన అయిదు బంతులకు..వికెట్ పడిన బంతికి లైన్ అండ్ లెంగ్త్ లో మార్పు లేదన్నారు. కానీ, ఒకే పాయింట్ నుంచి బయటకు.. లోపలకు టర్న్ చేసిన విధానం మాత్రం షమీకే సాధ్యమని ప్రశంసించారు. సెమీస్ లో అన్ని రంగాల్లో పటిష్ఠంగా ఉన్న కివీస్ పైన భారత బ్యాటర్లు - బౌలర్లు ఏ రకమైన ప్రదర్శన చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు సెమీస్ లో పూర్తిగా పేస్ త్రయం ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+