అత్యధిక సార్లు డోపింగ్ టెస్ట్ ఎదుర్కొన్న టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా..?
డోపింగ్ టెస్టు అనేది క్రీడాకారులు నిషిద్ధమైన మందులు లేదా పదార్థాలను ఉపయోగించారో లేదో నిర్ధారించడానికి చేసే ఒక పరీక్ష. ఇది క్రీడల్లో సమానత్వాన్ని కాపాడటానికి మరియు క్రీడాకారుల ఆరోగ్యాన్ని రక్షించడానికి చాలా ముఖ్యమైనది.డోపింగ్ అంటే క్రీడా పనితీరును మెరుగుపరచడానికి నిషిద్ధమైన మందులు లేదా పదార్థాలను ఉపయోగించడం. ఈ పదార్థాలు కండరాల పెరుగుదల, శక్తి స్థాయిలను పెంచడం లేదా నొప్పిని తగ్గించడం వంటివి చేస్తాయి.
భారత క్రికెట్ జట్టులో అత్యధిక సార్లు డోపింగ్ టెస్ట్ ఎదుర్కొన్న ఆటగాడు రోహిత్ శర్మ. అతను ఆరుసార్లు డోపింగ్ పరీక్షలకు హాజరయ్యాడు.2023 సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మూడుసార్లు డోప్ టెస్ట్ కోసం తన నమూనాను అందించాడు. ఈ విధంగా జడేజా అత్యధికంగా డోట్ టెస్ట్‌లకు హాజరైన క్రికెటర్‌గా నిలిచాడు.ఛతేశ్వర్ పుజారా, సూర్యకుమార్ యాదవ్ ఒక్కోసారి పరీక్షలు జరిగాయి. విరాట్ కోహ్లీపై మాత్రం ఒక్కసారి కూడా డోపింగ్ పరీక్షలు జరుగలేదు.మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన మూడు సార్లు డోపింగ్ పరీక్షలు ఎదుర్కొన్నారు.

ఇటీవల యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) 2025 సంవత్సరానికిగానూ.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్'లో అథ్లెట్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాళ్ల పేర్లను సైతం చేర్చింది. సూర్య, బుమ్రా, గిల్, పంత్, పాండ్యాతోపాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, అర్ష్‌దీప్ సింగ్, సంజూ శాంసన్, తిలక్ వర్మలను కొత్త లిస్ట్‌లో చేర్చారు. ఈ లిస్ట్‌లో మహిళా క్రికెటర్ల పేర్లు కూడా ఉన్నారు. షెఫాలీ వర్మ, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ, పేసర్ రేణుక సింగ్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని క్రికెటర్ల నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించి డోపింగ్ టెస్టు నిర్వహించడం జరిగింది.












Click it and Unblock the Notifications