శ్రీలంక ఓటమి కలచి వేసిందన్న సీవీ ఆనంద్
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర.. బ్రేకుల్లేని బండిలా సాగుతోంది. మరో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరార్ చేసుకుంది. ఈ టోర్నమెంట్ సెమీస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా తన పేరును లిఖించుకుంది.
గురువారం రాత్రి అచ్చొచ్చిన ముంబై వాంఖెడే స్టేడియంలో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది రోహిత్ సేన. ఏకంగా 302 పరుగుల తేడాతో విజయదుందుభిని మోగించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.

కేప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. శుభ్‌మన్ గిల్- 92, విరాట్ కోహ్లీ- 88, శ్రేయాస్ అయ్యర్- 82 పరుగులతో సత్తా చాటారు. ఈ ముగ్గురూ స్వల్ప తేడాతో సెంచరీని మిస్ అయ్యారు. 358 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ పోరాడలేకపోయింది. బౌలర్ల ధాటికి 55 పరుగుల వద్దే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌పై తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ స్పందించారు. 302 పరుగుల తేడాతో శ్రీలంక ఓడిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పరుగుల ఆంతర్యం నిజంగా తనను బాధ కలిగించిందని వ్యాఖ్యానించారు. ఏ మ్యాచ్ జరిగిన పోటాపోటీగా ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు.
ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌పై ఓ సుదీర్ఘమైన విశ్లేషణను ఆయన పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శనకు ఈ మ్యాచ్ అద్దం పట్టిందని ప్రశంసించారు. ఆ జట్టును అతి తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంతో జట్టు బౌలింగ్.. మరో మెట్టు పైకెక్కినట్టయిందని చెప్పారు.

నిజాయితీగా చెప్పాలంటే మాత్రం ఈ మ్యాచ్ తనను బాధ కలిగించిందని సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. శ్రీలంక జట్టు పరిస్థితి, ఆ జట్టు బ్యాటర్ల దిగజారుతున్న బ్యాటింగ్ చూస్తోంటే నిజంగా బాధగా కలిగిందని అన్నారు. ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు 50, ఇప్పుడు 55 పరుగులకే ఆలౌట్ కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
జయసూర్య, జయవర్ధనె, సంగక్కార వంటి బ్యాటర్లను శ్రీలంక ఎందుకు తయారు చేయలేకపోతోందని సీవీ ఆనంద్ చెప్పారు. వరల్డ్ కప్‌కు కనీసం అర్హత కూడా సాధించని వెస్టిండీస్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. క్రికెట్ ఆడే దేశాలు దాదాపు 10-12 ఉన్నాయని, వాటిల్లో నాలుగైదు జట్లు మాత్రమే బలంగా ఉంటోన్నాయని, అవి మ్యాచ్‌లన్నింటినీ ఏకపక్షంగా మార్చుతున్నాయని అన్నారు.
-
మూసీ తీరాన మహత్తరం -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications