IND Vs AUS: ఫైనల్ విజేతపై యూవీ లెక్కే వేరు - రోహిత్ టీంకు బిగ్ అలర్ట్..!!
ప్రపంచ కప్ తుది సమరం కొద్ది గంటల్లో జరగనుంది. కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న గ్రాండ్ ఫైనల్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. భారత్ వర్సస్ ఆసీస్ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లో సొంత గడ్డ పైన భారత్ విజయకేతనం ఎగుర వేస్తుందని కోట్లాది మంది ఆశతో ఉన్నారు. మాజీ క్రికెటర్లు సైతం అదే అంచనా వేస్తున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ ఫైనల్ పైన తన విశ్లేషణ చేసారు. రోహిత్ టీంకు కీలక సూచనలు చేసారు.
ఉత్కంఠ పోరు : వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపించింది. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్స్ లోనూ ఇదే జోరు చూపించి టైటిల్ గెలువాలని భారత అభిమానులు కోరుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి.. అన్ని మ్యాచ్‌ల్లో గెలుపొందింది. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.రెండు జట్లు ఫైనల్స్ లో హోరా హోరీగా తల పడటం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తున్నా.. కొన్ని అంశాల పైన మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

యూవీ హెచ్చరిక : స్వయం తప్పిదాలు మినహా భారత్ ఈ సారి ట్రోఫీ గెలవనీయకుండా అడ్డకునే శక్తి ఏదీ లేదన్నాడు. అయితే, ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని..తమదైన రోజే వాళ్లు చెలరేగటం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అయిదు సార్లు జగజ్జేతగా గెలిచిన ఆసీస్ కు ఇలాంటి హైఓల్టేజ్ మ్యాచ్ లో ఒత్తిడి జయించటం వెన్నతో పెట్టిన విద్య అని యూవీ పేర్కొన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ టోర్నీలో వాళ్ల ప్రదర్శన అద్భుతంగా సాగింది. ఫైనల్లోనూ బాగానే ఆడుతారనుకుంటున్నా. కేవలం తమంతట తాము తప్పు చేస్తే తప్ప ఈ సారి టీమిండియా ఓడిపోయే అవకాశాలు లేవని విశ్లేషించాడు. టీం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నందున ఖచ్చితంగా గెలిచి తీరుతారని యూవీ పేర్కొన్నాడు.
అందరి చూపు అటే : 2003 ప్రపంచ కప్ లో ఆసీస్ ఆద్యంతరం ఆధిప్యం కొనసాగించిందని గుర్తు చేసారు. ఈ సారి టోర్నీ మొత్తంలో టీమిండియా డామినేషన్ సాగిందననారు. కాబట్టి, ఈ సారి ఆసీస్ సాధారణ ప్రదర్శనతో గట్టెక్కే పరిస్థితి లేదన్నారు. అత్యుత్తమంగా రాణించకపోతే టీమిండియాను నిలువరించటం వారికి సాధ్యం కాదని యూవీ తేల్చి చెప్పాడు. మేజర్ టోర్నీల్లో ఒత్తిడి ఎలా జయించాలో ఆసీస్ కు తెలుసని..వారి ప్రదర్శన పైన అంచనా వేయ వచ్చన్నారు.రోహిత్ సేన మరింత జాగ్రత్తగా ఆడుతూ..ఇప్పటి వరకు ప్రదర్శించిన ఆట తీరునే కొనసాగిస్తే విజయం కష్టం కాదని యూవీ విశ్లేషించారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications