విమానంలో ఆ పనులేంటి.. అడ్డంగా బుక్కైన స్టార్ స్పిన్నర్! (వీడియో)
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అడ్డంగా బుక్కయ్యాడు. సాధారణంగా స్టేడియంలో తమ స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను తికమక పెట్టే యుజ్వేంద్ర చాహల్.. ఈ సారి విమాన ప్రయాణంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ వీడియోలో దొరికిపోయిన చాహల్
ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టు ఒక నగరం నుంచి మరో నగరానికి విమానంలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో జట్టు సభ్యుల సందడిని చిత్రీకరిస్తూ పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా టీమ్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో యుజ్వేంద్ర చాహల్ ఈ-సిగరెట్ (వేప్) ఉపయోగిస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ విషయం గమనించిన యాజమాన్యం వెంటనే వీడియోను డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే అది వైరల్ అయి వివాదానికి దారితీసింది.

నిబంధనల ఉల్లంఘన.. ప్రాణాలకు ముప్పు?
విమాన ప్రయాణాల్లో ధూమపానం లేదా ఈ-సిగరెట్ల వాడకంపై కఠినమైన నిషేధం ఉంది. ఇది కేవలం ఓ క్రీడాకారుడి క్రమశిక్షణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, విమాన భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశం. ఎలక్ట్రానిక్ సిగరెట్ల వల్ల విమానంలో అగ్నిప్రమాదం జరిగే ప్రమాదం ఉందని.. తద్వారా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను చాహల్ ముప్పులోకి నెట్టారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఫిర్యాదు అందితే.. చాహల్‌ను 'నో ఫ్లై లిస్ట్' (విమాన ప్రయాణాలపై నిషేధం)లో చేర్చే అవకాశం కూడా ఉంది.
🔴 ARSHDEEP SINGH DELETED VLOG CLIP 🤯
— Sam (@Cricsam01) May 7, 2026
- Yuzi Chahal was reportedly caught vaping inside an airplane.
First Riyan Parag and now Yuzi Chahal, both were caught vaping. What’s happening these days ?
pic.twitter.com/exdE0mhk7j
రియాన్ పరాగ్ బాటలో చాహల్.. బీసీసీఐ సీరియస్!
ఈ తరహా వివాదంలో చిక్కుకోవడం ఐపీఎల్ 2026లో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ ఉపయోగిస్తూ దొరికిపోయాడు. అప్పుడు బీసీసీఐ ఆయనకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. ఇప్పుడు చాహల్ వంటి సీనియర్ ఆటగాడు కూడా అదే బాటలో నడవడం బోర్డును ఆగ్రహానికి గురిచేస్తోంది. కోట్లాది మంది యువతకు రోల్ మోడల్స్‌గా ఉండే ఆటగాళ్లు ఇలాంటి పనులు చేయడం తప్పుడు సందేశాన్ని పంపుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కఠిన చర్యలు తీసుకునే అవకాశం
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో బీసీసీఐ, విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే చాహల్‌పై భారీ జరిమానా విధించడమే కాకుండా విమానయాన సంస్థలు ఆయనపై ప్రయాణ నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ కీలక దశలో ఉన్న సమయంలో చాహల్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం పంజాబ్ కింగ్స్ జట్టును కూడా ఆత్మరక్షణలో పడేసింది.












Click it and Unblock the Notifications