పర్సన్‌ ఆఫ్‌ దిఇయర్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

ఆ తర్వాత ఈ బేరసారాలు తేజ ఛానల్‌ కుచేరాయి. తెలుగుదేశం పార్టీ ఆఫర్‌ చేసిన మొత్తానికి ప్రాగ్రాంనులైవ్‌ టెలికాస్ట్‌ చేయడానికి తేజ యాజమాన్యంఅంగీకరించి గత సోమవారం కార్యక్రమాన్ని లైవ్‌టెలికాస్ట్‌ చేసింది. ఇటువంటి కార్యక్రమంవల్ల ఒక పార్టీ ముద్ర తమ మీద పడుతుందని సంకుచితంగా ఆలోచించకుండాముందు ముందు అన్ని పార్టీలూ ఇటువంటి కార్యక్రమాలప్రతిపాదనలు పెడతాయన్న ఆశాభావంతో దీనిని ప్రయోగాత్మకంగా తేజయాజమాన్యం అంగీకరించింది. తేజలో గత సోమవారంటెలికాస్ట్‌ అయిన ఈ కార్యక్రమం విజయవంతమైనట్టు తెలుసుకోడానికితెలుగుదేశం పార్టీకీ, తేజ యాజమాన్యానికిఎంతో సమయం పట్టలేదు.

అలాగే ఇతర పార్టీలు కూడా. ఒక పార్టీ ఆధ్యక్షుడు ఆ పార్టీకిచెందిన లక్షలాది కార్యకర్తలతో ఇంటరాక్ట్‌ అవడంఅసాధ్యం. టీవీ మీడియా ఒక్కటే అందుకు వేదికకాగలదు. తెలుగుదేశం పార్టీ నుంచి స్ఫూర్తి తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడుచంద్రశేఖర రావు నెలకోసారి గంట సేపు తేజ ఛానల్‌లో ఇటువంటి కార్యక్రమం చేయడానికి సిద్ధమవుతున్నారు. గంటకుఅరవై వేల రూపాయలకే తేజ యాజమాన్యంఅంగీకరించినట్టు తెలిసింది. అయితేతెలుగుదేశం, టీఆర్‌ ఎస్‌ ల టెలివిజన్‌ కార్యక్రమాలకుమౌలికంగా ఒక తేడా ఉంది. తెలుగుదేశంకార్యక్రమంలో చంద్రబాబు నాయుడే సర్వం. టీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో చంద్రశేఖరరావుతో పాటు తెలంగాణ మేధావులు కూడాకార్యకర్తలతో ఇంటరాక్ట్‌ అవుతారు.

టీడీపీ, టీఆర్‌ఎస్‌ ల స్ఫూర్తితో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కూడా కార్యకర్తలతో నేరుగా మాట్లాడడానికి టీవీమీడియాను ఎంచుకోవాలని ఆలోచిస్తునట్టు గాంధీభవన్‌వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యక్రమాలకు ప్రైవేటు టీవీ ఛానల్స్‌ను ఉపయోగించుకోవచ్చని తెలుగుదేశం పార్టీకిచెందిన ఒక సాధారణ నాయకుడికి వచ్చిన ఆలోచన సూపర్‌హిట్‌ అయింది.  Recent Stories

  • పల్స్‌పోలింగ్‌!
  • వైఎస్‌ కు సమాంతరం?
  • టిడిపి ఆశాభావం
  • సిఎం అతి జాగ్రత్తలు!
  • ఆశలుడిగినట్లే...
  • సర్దుపాటు
  • అనీమన టీవీలేనా?
  • సింగపూర్‌ ఇమిటేషన్‌!
  • ఐటీ గతి అంతేనా?

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి