• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరో నెల మౌనం

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Friday, November 12 2004

హైదరాబాద్‌: అది 1987 వ సంవత్సరం ఆగస్టు 22. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి కంచి మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. మఠం నియమావళి ప్రకారం పీఠాధిపతి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. జయేంద్ర సరస్వతి అదృశ్యమైన వార్తను దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. నాలుగు రాష్ట్రాల పోలీసుకు ఆయన కోసం అన్వేషించారు. చివరికి ఆయన కర్నాటక కూర్గ్‌లోని తలకావేరి వద్ద కన్పించారు. ఆయన అలా మాయం కావడం ఇప్పటికీ పెద్ద మిస్టరీ.

కాంచీపురంలోను వరదరాజ స్వామి ఆలయం మేనేజర్‌ శంకర రామన్‌ శంకర మఠం వ్యవహారాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. నీతినిజాయితీలకు మారుపేరైన ఆయన ఈ ఏడాది సెప్టెంబర్‌ మూడున హత్యకు గురయ్యారు. శంకరరామన్‌ హత్యలో జయేంద్ర సరస్వతి ముఖ్యమైన పాత్ర పోషించారని, అందువల్లనే ఆయనను అరెస్టు చేశామని కడలూరు ఎస్పీ సి. ప్రేంకుమార్‌ గురువారం అర్ధరాత్రి విలేకరులకు చెప్పారు. అవినీతిని సహించని శంరరామన్‌కు కంచి పీఠంలో నిధుల దుర్వినియోగం కావడం బాధ కలిగించింది. మఠంలో జరుగుతున్న వ్య్వహారాలను త్వరలో బయటపెడతానని ఆయన ఇటీవల పత్రికలకు ఎక్కిన కొన్ని రోజుల్లోనే ఆయన హత్య జరిగింది.

శ్రీ జయేంద్ర సరస్వతి మొదటి నుంచి అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి అనేక సందర్భాల్లో కంచి పీఠాన్ని, జయేంద్ర సరస్వతిని విమర్శించారు. పదిహేడేళ్ళ క్రితం జయేంద్ర అదృశ్యమైనప్పుడు స్వరూపానంద ఇలా వ్యాఖ్యానించారు. జయేంద్ర సరస్వతిని శంకరాచార్యగా వ్యవహరించకూడదు. ఎందుకంటే ఆది శంకరాచార్య స్ధాపించిన నాలుగు పీఠాల్లో కంచి లేదు. అది శృంగేరి పీఠానికి శాఖ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ కంచి కామకోటి పీఠం దేశంలోని అగ్రశ్రేణి పీఠాల్లో ఒకటిగా అభివృద్ధి చెందింది. జయేంద్ర కంటే ముందు ఈ పీఠానికి అధిపతిగా ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి హయాంలో ఈ పీఠం బాగా అభివృద్ధి చెందింది.

తమిళనాడులో నాగపట్నం జిల్లా కొత్తూరుకు సమీపంలోని ఇరుల్‌ నీక్కి అనే మారుమూల గ్రామంలో జయేంద్ర సరస్వతి 1935 లో జన్మించారు. ఆయన ఆదిశంకరాచార్యుడి 69 వ వారసడవుతారని ఎవరూ అనుకోలేదు. జయేంద్ర స్వామి చిన్నప్పటి పేరు సుబ్రమణ్యం. పదమూడేళ్ళ వయసులోనే రుగ్వేద సంహిత కోర్సు పూర్తి చేసిన సుబ్రమణ్యం శంకరాచార్య మఠానికి చెందిన జగద్గురు విద్యాస్ధాన్‌లో చేరారు. ఈ పాఠశాలలో ఉన్నప్పుడే సుబ్రమణ్యం కంచి పీఠం ఆస్ధాన విద్వాంసుడు కృష్ణ శాస్త్రి గళ్‌ దృష్టిలో పడ్డాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతికి ఇతనే సరైన వారసుడని ఆయన గ్రహించారు.

కంచి పీఠం ఖజానాలో పుష్కలంగా నిధులు ఉన్నాయి. అనేక సమాజిక సేవాకార్యక్రమాలని ఈ పీఠం నిర్వహిస్తోంది. రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించడానికి మూడు పక్షాలృ ఉండాలని, అందులో తనను ఒక పార్టీగా చేర్చాలని జయేంద్ర సరస్వతి కోరినప్పుడు ఉత్తరాది స్వామీజీలు జయేంద్రను తీవ్రంగా విమర్శించారు. ఆయన రాజకీయాల్లో జోక్య చేసుకోవడం మఠాన్ని కలుషితం చేయడమేనన్న విమర్శలు వచ్చాయి. తిరుమల వేయికాళ్ళ మంటపం విషయంలో కూడా చినజీయర్‌ స్వామికి ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. ఇద్దరూ తీవ్ర స్ధాయిలో పరస్పరం విమర్శించుకున్నారు. జయేంద్ర సరస్వతికి ఎఐడిఎంకె, బిజెపిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జయేంద్ర సరస్వతి కూడా ఈ దేశంలో ఒక పౌరుడే కాబట్టి చట్టం తనపని తాను చేసుకుపోవడాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు. అలాగని రాజకీయ కక్షసాధింపు చర్యలను ఎవరూ హర్షించరు. స్వామి నిర్దోషి రుజువైతే సత్యమేవ జయతే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X