Home
హైదరాబాద్:కేంద్ర కేబినెట్ మంత్రిగా కె.చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేసి ఐదు నెలలుముగిసి ఆరో నెలనడుస్తోంది. ఒక శాఖంటూ లేకుండా ఇంతకాలం కేంద్ర మంత్రిగా ఉన్నది చరిత్రలో బహుశా ఆయనే కావచ్చు. నాకుతెలంగాణ సాధన ముఖ్యం, శాఖ కాదు అనిచెప్పిన చంద్రశేఖరరావేడిసెంబర్‌లోగా తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని అనేక సార్లుప్రకటించారు. డిసెంబర్‌లోగా తెలంగాణఏర్పాటు ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి కనీసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుప్రక్రియ అయినా ప్రారంభమయ్యేలా చూడాలని ఆయనతాపత్రయపడుతున్నారు.
తెలంగాణరాష్ట్రం కోరుకుంటున్న వారిలో ఇప్పటికేకెసిఆర్ మీద అపనమ్మకం చోటు చేసుకుంది. కెసిఆర్ తెచ్చే తెలంగాణతమకు అక్కరలేదని, ప్రత్యేకతెలంగాణ తమ ద్వారానే సాధ్యమనినక్సలైట్లు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈపరిస్ధితిలో చంద్రశేఖరరావు పరిస్ధితికుడితిలో పడిన ఎలుక చందంగా మారింది. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌మంత్రులపరిస్ధితి కూడా అంతంత మాత్రంగా ఉంది.రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలనుటిఆర్‌ఎస్ మంత్రులు బహిష్కరించడాన్ని తీవ్రంగా పరిగణించాలనిముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సోనియాగాంధీకివిన్నవించినట్టు తెలిసింది. కెసిఆర్‌కువ్యతిరేకంగా సోనియాగాంధీ వద్దఫైళ్ళు పెరిగిపోతున్నాయి.
అయినాచంద్రశేఖరరావు మొండితనంవీడడం లేదు. అదే తన ప్లస్ పాయింటని ఆయననమ్మకం. మాటలమరాఠీగా పేరుపొందిన ఆయన ఈమధ్య మాటలు తగ్గించినా ఆయన తన దారిలో తాను సాగిపోతున్నారు. ఈనేపధ్యంలో కాంగ్రెస్-టిఆర్‌ఎస్‌లమధ్య హనీమూన్ ముగియడానికి ఎంతోకాలం పట్టదని తెలుస్తోంది. కాంగ్రెస్‌తోతెగతెంపులు చేసుకుంటే తమపరిస్ధితి నడి సముద్రంలో నావ చందంగామారుతుందన్న వాస్తవం తెలిసినచంద్రశేఖరరావు కొత్తఎత్తుగడలను అన్వేషిస్తున్నారు.
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆదిమానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాదగాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలోవీరప్పన్ సినిమా
అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్
దసరామూవీస్
రెండోరౌండు సాధ్యమే!
కెసిఆర్‌మీమాంస
లంచగొండితనంసమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
