• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉదయభాను విషాదగాధ

By Staff
|

Udayabhanuహైదరాబాద్‌:టీవీ యాంకర్‌ నవ్వుతూ, తుళ్ళుతూఉండే ఉదయబాను వెనుక ఇంతవిషాదం దాగి ఉందంటే ఎవరూ నమ్మరు.తన ప్రేమ వివాహం, కుటుంబసభ్యుల బెదిరింపు,పోలీసు కేసు నేపధ్యంలో ఉదయభానుబుధవారం ఉదయంవిలేకరుల సమావేశంలో కన్నీరు మున్నీరుగా విలపించింది.కుటుంబసభ్యులుతనను ఎలా వేధించారో వివరించింది.తాను ప్రేమ వివాహం చేసుకుంటే తనసంపాదన తనకు దక్కదన్నఅక్కసుతో తన తల్లి బ్లాక్‌ మెయిల్‌ చేస్తోందనిఆమె చెప్పింది. ఆమె బాధ ఆమె మాటల్లోనే...

మానాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు. నాకు నాలుగేళ్ళ వయసున్నప్పుడు నాన్న చనిపోయాడు.అమ్మ ఒక ముస్లింను రెండోపెళ్ళి చేసుకుంది. అతనికి అప్పటికేఏడుగురు పిల్లలు. తొమ్మిదో తరగతి చదువుతున్నటినుంచి నేను టీవీల్లో, సినిమాల్లో నటిస్తూ వచ్చిన డబ్బునంతాఇంటికే ఖర్చు పెట్టాను. నాకు పదిహేనేళ్ళవయసులో మా మమ్మీ నాకు ఒకముస్లింకు ఇచ్చి పెళ్ళి చేసింది. నాకు తెలిసీతెలియని వయసులో మమ్మీ మాటకాదనలేక పెళ్ళి చేసుకున్నాను.నాకిప్పుడు ఇరవై నాలుగేళ్ళు. పెళ్ళిచేసుకున్నానే కానీ అతనితో కాపురం చేయలేదు.విడాకులు తీసుకున్నాను.టీవీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయిన నేను పదిహేడుమంది ఉన్న కుటుంబాన్ని నాసంపాదనతోనే పోషించాను. నాకష్టార్జితంతో మియాపూర్‌లో కట్టుకున్నబంగళాను అమ్మ పేరు మీదే పెట్టాను. దానికోసం చేసిన అప్పులు నా పేరు మీద ఉన్నాయి.ఇప్పుడు నా మెడలో ఉన్న ఈ రెండు గొలుసులుమినహా నా కంటూ నగల్లేవు. బ్యాంకు బ్యాలెన్స్‌లేదు.

నన్నునన్నుగా అర్ధం చేసుకున్న విజయ్‌ని పెళ్ళిచేసుకోవాలనుకున్నాను. ఈ విషయం తెలిసిఅమ్మ నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తోంది.యాభై లక్షలు ఇవ్వకపోతే మొదటిపెళ్ళి విషయం బయట పెడతానని బెదిరించింది.ఇప్పుడు విజయ్‌ని పెళ్ళి చేసుకున్నాను.చేసుకున్నాను. మా అమ్మకు ఈ పెళ్ళి ఇష్టంలేదు. అందువల్ల నన్ను బ్లాక్‌మెయిల్‌చేస్తోంది. మా అన్నను కూడా నేనే ఇంజినీరింగ్‌, ఎంబిఎచదివించాను.మొదట్లో నన్ను ఎంతగానో ప్రేమించినమా అన్న కూడా మా అమ్మ చెప్పుడు మాటలువిని దొంగ ల.... అని తిట్టేవాడు. గతసంవత్సరం ఇంట్లో నుంచి పారిపోయి ఒకమహిళా న్యాయవాది ఇంట్లో ఏడాది పాటుతలదాచుకున్నాను. కన్న తల్లే నా ప్రాణాలుతీయాలని ప్రయత్నిస్తోంది. అని చెబుతూ ఆమె ఏడుపుఆపుకోలేకపోయింది.

ఉత్తమ కంపెనీల్లో సత్యం

హిందీలోవీరప్పన్‌ సినిమా

అడవులవిస్తరణలో రాష్ట్రం టాప్‌

దసరామూవీస్‌

రెండోరౌండు సాధ్యమే!

కెసిఆర్‌మీమాంస

లంచగొండితనంసమస్య కాదా?

నానితో ఎన్టీఆర్‌కటీఫ్‌

ఇకనైనా నిదానం నాగేందర్‌

పాపం, భారతీయుడు!

ఇద్దరుతల్లులు-ఇద్దరు కొడుకులు

నక్సల్స్‌ అప్‌బీట్‌

వీసాలపైఆశలు

వెయ్యికార్ల ర్యాలీ

ఈయనకు ఎక్సయిజ్‌ శాఖ కావాలట!

సెప్టెంబర్‌ పదకొండు వాస్తవాలు

అనంత ఎస్పీ అనుభవం

కెసిఆర్‌కు చివరకు మిగిలింది?

మనమే వీసాల వీరులం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X