వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిలికానాంధ్ర-అవధానం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 08-08-2005

హౖౖెదరాబాద్‌:అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖసాహితీ సాంస్కృతికసంస్ధ సిలికానాంధ్ర నాలుగోవార్షికోత్సవం ఆగస్టు ఆరో తేదీనవైభవంగా జరిగింది. దాదాపు ఎనిమిది వందలమంది హాజరయ్యారు. నాలుగున్నర గంటలపాటు గరికపాటి నరసింహారావు గారిఅవధాన కార్యక్రమం పద్యాలతో, ఛమత్కారాలతో,హాస్యోక్తులతోఆహ్లాదకరంగా సాగింది. మొదట సభ కుఅధ్యక్షత వహించిన సిలికానాంధ్రఉపాధ్యక్షుడు, కవి కిరణ్‌ప్రభపృచ్ఛకులను, అవధానిని, ముఖ్య అతిధిగుమ్మడి గోపాలకృష్ణను వేదిక మీదికిఆహ్వానించారు. నిషేధాక్షరి నిర్వహించినతల్లాప్రగడ రామచంద్రరావుత్రిశంకు స్వర్గం లాంటి అమెరికా జీవనవిధానాన్ని తేటగీతి పద్యంలో చెప్పమనిఅవధాని గారిని కోరారు. అడుగ్డుగునాఅడ్డుపడుతూ అవధాని గారి పద్య రచనానైపుణ్యానికి సవాలు విసిరారు. వర్ణనఅంశాన్ని నిర్వహించిన శ్రీమతి వల్లభనేనిహరిణి కోనసీమలో అమ్మాయి, కాలిఫోర్నియాఅబ్బాయి కోసం వేచి ఉండడాన్ని వర్ణించమనికోరారు. కూచిబొట్ల ఆనంద్‌ అప్రస్తుతప్రసంగం అవధాని గారి ఏకాగ్రతనుపరీక్షగా మారిన వారి ఛమత్కార సమాధానాలు ప్రేక్షకులనురంజింపచేశాయి.

వార్షికోత్సవంలోభాగంగా సిలికానాంధ్ర కొత్తకార్యవర్గం పదవీ బాధ్యతలుస్వీకరించింది. కొత్త అధ్యక్షుడుగాకిరణ్‌ప్రభ, ఉపాధ్యక్షుడుగాఅయ్యగారి శాంతి వర్ధన్‌, కార్యదర్శిగాఅన్నం అనిల్‌, సహ కార్యదర్శిగా పొట్టియామిని, కోశాధికారిగా కడియాల మాధురిపదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్‌8న జరుగనున్న భారీ సాంస్కృతికకార్యక్రమం గురించి వివరించారు.

సిలికానాంధ్రకొత్త అధ్యక్షుడు కిరణ్‌ ప్రభసంస్ధ పుట్టినప్పటి నుంచికార్యక్రమాల నిర్వహణలో చురుకుగాపాల్గొన్నారు. రెండేళ్ళుగాఉపాధ్యక్షుడుగా ఉన్నారు. ఫోటో క వితలకిరణ్‌ప్రభగా ఆయన తెలుగు పాఠకులకు సుపరిచితులు. సిలికానాంధ్రనిర్వహిస్తున్న వెబ్‌ మాగజైన్‌సుజనరంజనికి ఆయనసంపాదకులుగా ఉన్నారు. ఉపాధ్యక్షుడుఅయ్యగారి శాంతివర్ధన్‌ నాలుగేళ్ళుగాసిలికానాంధ్ర ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌విభాగానికి ఇంచార్జిగా వ్యవహరించారు.కార్యదర్శి అన్నం అనిల్‌ ఫుడ్‌ కమిటీని నిర్వహించారు.పొట్టి యామిని పేరొందినగాయని. కడియాల మాధ వి అనేకసాంస్కృతిక కార్యక్రమాలను డిజైన్‌ చేశారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X