బిజె పి భంగపాటు!
హైదరాబాద్:గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుఓడిపోవడం, రాష్ట్రపతి ప్రసంగంలోప్రత్యేక తెలంగాణ ప్రస్తావనఉండడం తదితర కారణాల వల్లఏడాదిగా నిదానంగా ఉన్న హైదరాబాద్‌నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్ళీపుంజుకుంటున్నట్టు కన్పిస్తోంది.అంతర్జాతీయ విమానాశ్రయం వస్తునశంషాబాద్ చుట్టుపక్కల భూల ధరలకులెక్కలు వచ్చాయి. నగరంలోని మిగితాప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలునిలకడగా ఉన్నప్పటికీ బెంగుళూరురోడ్డులో ఉన్న శంషాబాద్ చుట్టుపక్కలమంచి ధరలు పలుకుతున్నాయి.
తెలంగాణరాష్ట్రం ఏర్పడుతుందన్న ఫీలర్లువచ్చినప్పటినుంచి నగర శివారుప్రాంతాల్లోని ఇళ్ళ స్ధలాల ఇన్‌స్టాల్‌మెంట్‌బిజినెస్ బాగా పడిపోయింది. ఈ విధమైనబిజినెస్ చేస్తున్న రియల్ ఎస్టేట్‌సంస్ధలన్నీ విజయవాడ- గుంటూరు,విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల మీద దృష్టిపెట్టాయి. జూబిలీహిల్స్, బంజారాహిల్స్‌తదితర ప్రాంతాల్లో ఇళ్ళ స్ధలాలధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ,ఇప్పుడు ధరలు సహేతుకంగాఉన్నాయని, గతంలో ఉన్న హైప్‌ఎగిరిపోయిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులుచెబుతున్నారు.
శంషాబాద్‌ప్రత్యేకత
శంషాబాద్‌సమీపంలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయవిమానాశ్రయానికి శంఖుస్ధాపనచేయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియాగాంధీ ఈనెల పదహారునహైదరాబాద్ రానున్నారు.గచ్చిబౌలి-శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుమొదటి దశ నిర్మాణం పనులుమూడు నెలల్లో ప్రారంభం కానున్నాయి.250 అడుగుల ఈ రింగ్ రోడ్డు మరో దశలోమియాపూర్ వరకు విస్తరించనుంది.శంషాబాద్ చుట్టుపక్కల 450 చదరపుకిలో మీటర్ల ప్రాంతాన్ని హైదరాబాద్‌ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీకిందికి తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీలఏర్పాటు నిషిద్ధం. అందువల్ల ఇది కాలుష్యరహిత ప్రాంతం అవుతోంది. ఈ కారణాలవల్ల ఈ ప్రాంతం రియల్‌ఎస్టేట్‌పెట్టుబడులకు అనుకూలంగా మారింది.












Click it and Unblock the Notifications