లంచాలపై భారీ సర్వే
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 01-07-2005
హైదరాబాద్:భారతదేశంలోని సామాన్యులు ఏటా 21,068కోట్లు లంచాల రూపంలో సమర్పించుకుంటున్నారని ఒకఅధ్యయనంలో వెల్లడైంది. సర్వేలో జవాబులు చెప్పిన వారిలో 62 శాతం లంచంసాధారణ విషయమని, తాము చాలాసార్లులంచాలు ఇచ్చామని అంగీకరించారు. ఇండియాకర ప్షన్ స్టడీ-2005 ను ట్రాన్స్‌పరెన్సీఇంటర్నేషనల్ సంస్ధ విడుదల చేసింది. ఇదిసామాన్యులు పోలీసు స్టేషన్లు, కింది కోర్టులు,భూముల రిజ్రిస్టేషన్ తదితరప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇస్తున్న లంచాలమొత్తం. ఇక పెద్ద స్ధాయిలోకాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు,వ్యాపారులు ఉన్నతాధికారులకు, మంత్రులకుఇస్తున్న లంచాల పరిమాణం దీనికి ఐదు రెట్లు ఎక్కువగా అనగా కోటి కోట్లుఉంటుందని అంచనా.
అవినీతిచార్టులో పోలీసుశాఖ అగ్రభాగంలో ఉండగా, నీటి సరఫరావిభాగం అట్టడుగున ఉంది. నీరు సమూహికఅవసరం కాబట్టి లంచాలు డిమాండ్ చేస్తేజనం ఏకమై తిరగబడతారని కావచ్చు.బీహార్ రాష్ట్రం లంచగొండితనంలోఅగ్రస్ధానంలో ఉండగా కేరళ చివరిస్ధానంలో ఉంది. కేరళ ప్రజలను, అక్కడిప్రభుత్వాలను ఈ విషయంలో అభినందించాలి.లంచగొండి తనంలో బీహార్ తర్వాతస్ధానం జమ్ము-కాశ్మీర్‌ది. మూడో స్ధానంమధ్యప్రదేశ్‌ది. తక్కువ లంచగొండితనం ఉన్న రాష్ట్రాల్లో ఈ అధ్యయనంప్రకారం ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈసర్వేను మన రాష్ట్ర ప్రజలు చదివితేసర్వేలో ఎక్కడో తప్పుజరిగిందనుకుంటారు. కింది స్ధాయి ఉద్యోగులలంచగొండితనం మన రాష్ట్రంలో చాలాఎక్కువే. నిన్నటికి నిన్న గుంటూరుకు చెందినఇద్దరు సబ్-రిజ్రిస్టార్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకుదొరికిపోయారు. ఐఎఎస్ స్ధాయి అవినీతి కూడామన రాష్ట్రంలో ఎక్కువే.
ఈ ఇండియాకరప్షన్ స్టడీ-2005ను 14,405శాంపిల్స్‌తో 20 రాష్ట్రాల్లో, 151 నగరాల్లో నిర్వహించారు. సర్వే వివరాలనుఅడ్మిరల్ (రిటైర్డ్) ఆర్ హెచ్ తహిల్యానీనిర్వహించారు. ఆయన భారత నౌకాదళ చీఫ్‌గాపనిచేశారు. సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయడం, మీడియాసహకారం, ప్రజల్లో చైతన్యం ద్వారా అవినీతిని లంచగొండి తనాన్ని తగ్గించవచ్చనిఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
