వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు గడ్డుకాలం

By Staff
|
Google Oneindia TeluguNews
Chandrababu Naiduహైదరాబాద్‌:చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశంపార్టీకి గ్రహణం పట్టినట్టుగా కన్పిస్తోంది.అధికార కాంగ్రెస్‌ అక్రమాలనువెలికితీయాల్సిన చంద్రబాబు తానే తీవ్రఅవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. చంద్రబాబునాయుడు పాలనలో కొన్నివందల కోట్ల ప్రజాధనం వృధా అయినవిషయాన్ని క్రంప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌జనరల్‌ నివేదిక నిర్ధారించింది. ముఖ్యంగానీరు-మీరు కార్యక్రమం కింద కొన్నివందల కోట్ల నెదర్లాండ్‌ నిధులనువృధా చేశారు. ఉన్నతాధికారులు,కాంట్రాక్టర్లు కుమ్మక్కై గాదె కిందపందికొక్కుల్లా నిధులను మింగేశారు. ఆసమయంలో ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్‌అధికారులు చంద్రబాబు నాయుడి దృష్టికితీసుకువచ్చినా ఆయనప్రతిస్పందించలేదన్నవిమర్శలున్నాయి. పనికి ఆహారం పథకంకూడా తెలుగుదేశం నాయకుల స్వాహా పథకంలామారిన విషయం తెలిసిందే.ఆనాటి తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో దాదాపుఅందరి మీదా ఈ పథకం విషయంలో ఆరోపణలువచ్చాయి.

ఇప్పుడుకాంగ్రెస్‌ హయాంలో అవినీతి అంతరించిందనిచెప్పలేం. నీటిపారుదల టెండర్లవిషయంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. వివిధ శాఖల మంత్రులు ఆకు మీద మిడతల్లాస్వాహాకు పాల్పడుతున్నారన్న విమర్శలువచ్చాయి. హోంమంత్రి జానారెడ్డి అయితే ట్రెయినీ కానిస్టేబుళ్ళచేత బలవంతంగా ఇన్సూరెన్సు పాలసీలను తనమనుషుల చేత చేయిస్తున్నట్టుఅధికార వర్గాలే ధృవీకరించాయి. అవినీతిఅప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితేదినపత్రికలు ఆనాడు ఏది జరిగినా ఏమీ జరగనట్టుమిన్నకుండి పోగా, ఇప్పుడు అవినీతి కుంభకోణాలను అదే పనిగా వెలికితీస్తున్నాయి.

అవినీతికథలను వెలికి తీయడం ప్రజాస్వామ్యానికిమంచిదే. ఈ విషయంలోపక్షపాతం మాత్రం ఉండకూడదు.హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌటాలాకేసును సిబిఐకి అప్పగించినట్టు చంద్రబాబు నాయుడిహయాంలో అవినీతి ఆరోపణలపైస్వతంత్ర సంస్ధతో దర్యాప్తు జరిపిస్తేచాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అలాగేఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వచ్చేప్రభుత్వాలు కూడా దర్యాప్తు జరిపించాలి.అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.

వైఎస్‌ప్రభుత్వంపై అప్పుడే నిట్టూర్పు విన్పిస్తున్నాతొమ్మిదేళ్ళ చంద్రబాబు నాయుడు పాలనలో కలిగినమనస్తాపాన్ని సామాన్యులు మరిచిపోలేకపోతున్నారు.తెలుగుదేశం నాయకులు కూడా ఇప్పుడు చెట్టుకొకరుపుట్టకొకరు అన్నట్టున్నారు.పరిటాల రవి హత్య తర్వాతఅనంతపురం జిల్లాలో టిడిపినినడిపించే నాధుడు కరువయ్యాడు.గతంలో వలే కాంగ్రెస్‌అధిష్టానవర్గం చీటికీ మాటికీ ముఖ్యమంత్రులనుమార్చితేతెలుగుదేశం పార్టీకి మేలు జరగవచ్చు. కానీ కాంగ్రెస్‌హైకమాండ్‌ వ్యవహార శైలి గతంకంటే భిన్నంగా ఉంది. ఈ పరిస్ధితుల్లోతెలుగుదేశం పార్టీని విజయపథంలోనడిపించడం చంద్రబాబు నాయుడికికత్తి మీద సామే.

ఇటీవలికథనాలు

  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X