వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థమ్స్‌ అప్‌పైచిరువివరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 27-10-2005

హైదరాబాద్‌:సినీనటుడు చిరంజీవి నటించిన థమ్స్‌అప్‌ కూల్‌డ్రింక్‌ టీవీ యాడ్‌ ఇంకావివాదాస్పదమవుతోంది. ఆఅడ్వర్టయిజ్‌మెంట్‌ ద్వారా ఆ కూల్‌డ్రింక్‌ కంపెనీ తనగుడ్‌విల్‌ను పూర్తిగాఉపయోగించుకుందని, నన్ను నమ్మండి థమ్స్‌ అప్‌ వందశాతం సురక్షితమైనది అన్న మాటలనుతీసివేయమని ఆ కంపెనీనిఅడగాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ విషయాన్నిఆయన జన విజాన వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి టివి రావుకు చెప్పారు. థమ్స్‌ అప్‌నూరు శాతంసురక్షితమైనదని ఆయన నటించడాన్ని తప్పు పడుతూ ఈ సంస్ధచిరంజీవికి ఇటీవల బహిరంగ లేఖరాసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకూడా ఇదే విషయాన్ని చిరంజీవి దృష్టికి ఒక లేఖద్వారా తీసుకువచ్చారు. సామాజిక బాధ్యతను పరమపవిత్రంగా భావించే ఒక పెద్ద నటుడుఆరోగ్యానికి హాని కలిగించే కూల్‌డ్రింక్‌నుప్రమోట్‌ చేయడం సమంజసం కాదనివీరందరి వాదన. వీరి లేఖల్లోనిముఖ్యాంశాలు:

ఈయాడ్‌ప్రజలను, అమాయక గ్రామీణులనుతప్పుదారి పట్టించేదిగా ఉంది. సమాజంలో ఒకబాధ్యత కలిగిన స్ధానంలో ఉన్న మీరు ఆప్రకటనను ఉపసంహరించుకోవాలి.పుకార్లు నాకు నచ్చవు అన్నారు ఆయాడ్‌లో. పుకార్లకి, శాస్త్రీయంగారుజువైన వాస్తవాలకు మీకు తేడాతెలుసని అనుకుంటున్నాము. కోలాలుసురక్షితమైనవని ప్రకటించడంతప్పని పార్లమెంటరీ కమిటీ ఎప్పుడోస్పష్టంగా చెప్పింది. ఈ సంగతి తెలిసినా థమ్స్‌ అప్‌ వంద శాతంసురక్షితమైనదని నేను నమ్ముతున్నాను అనిమీరు అంటున్నారు. పార్లమెంటరీ కమిటీ వివిధ ల్యాబ్స్‌లోపరీక్షించి, పరిశీలించి తమ నివేదికను రూపొందించింది.దానికి విరుద్ధంగా మీకు నమ్మకం కలిగించినవిషయాలనుబయటపెట్టండి. థమ్స్‌ అప్‌లో ఉన్న పోషకపదార్ధాలు ఏమిటి? దానిలో పెస్టిసైడ్స్‌అవశేషాలు లేవా? ఫాస్ఫరిక్‌, కార్బొనిక్‌ఆసిడ్స్‌ ఉన్న విషయం నిజం కాదా?రాజ్యాంగబద్ధమైన పార్లమెంటరీకమిటీ కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి హానికరమైనవని నిర్ధారించడంపుకార్లేనా? బహుళజాతి సంస్ధలైన కోలాకంపెనీలు ఏటా మనదేశంలో 18 వేల కోట్లవ్యాపారం చేస్తున్నాయి. కొబ్బరి బోండాం,పళ్ళరసాలను ప్రోత్సహిస్తేమనరైతులు బాగుపడతారు. ఇవీ చిరంజీవికి వేదిక రాసిన లేఖప్రధానాంశాలు.

వేదికరాష్ట్ర కార్యదర్శి టివి రావును చిరంజీవిపిలిపించుకుని తన వివరణ ఇచ్చినట్టుతెలిసింది. థమ్స్‌ అప్‌లో పెస్టిసైడ్స్‌అవశేషాలు, హానికరమైన రసాయనాలసంగతి తనకు తెలియదని, బాట్లింగ్‌సమయంలో బొద్దింకలు, బల్లులుపడడం లేదని కన్విన్స్‌ అయినతర్వాతే ఆ దృష్టితోనే థమ్స్‌ అప్‌సురక్షితమైనదని తాను చెప్పాననిచిరంజీవి వివరణ సారాంశం. యాడ్‌లోని కొన్నిమాటలను తొలగించమని కంపెనీని అడుగుతానని, ప్రకటనరూపాన్ని మార్చమని కోరుతానని చిరంజీవి టివిరావుకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏదైనాటెక్నికాలిటీ వల్ల కుదరకపోతే మార్చినాటికియాడ్‌ కాలపరిమితి ముగుస్తుందని, అప్పుడు కొత్తషరతులు పెడతానని చిరంజీవి అంటున్నారు.

తమిళంలోఇటువంటి యాడ్‌లో నటించిన ఒక హీరోప్రజల వత్తిడి మేరకు ఆ యాడ్‌నుఉపసంహరించుకున్నారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X