వైఎస్‌చాపర్‌ యోగం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 28-06-2005

YSRహైదరాబాద్‌:ఐడియా ఒకరిది, ఆనందం మరొకరిది అన్నట్టుఉంది చంద్రబాబు నాయుడు,రాజశేఖరరెడ్డిల వ్యవహారం. కలిసొచ్చేకాలమొస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా ఉంది వైఎస్‌యోగం. సచివాలయం పక్కన హెలిపాడ్‌ నిర్మించుకునిఎంచక్కా ఇంటినుంచి హెలికాప్టర్‌లో మూడునిమిషాల్లో వచ్చేయొచ్చు అనుకునేవారు చంద్రబాబునాయుడు. రాష్ట్రానికి 57 వేలకోట్ల అప్పులున్నా, ప్రజాధనంతో కెనడా నుంచి హెలికాప్టర్‌కొనడానికి ఆయనవెనుకాడలేదు. తీరా హెలికాప్టర్‌ వచ్చాకసచివాలయం పక్కన ఎకరంస్ధలంలో హెలిపాడ్‌ కట్టడానికి స్ధానికులుఒప్పుకోలేదు. వాళ్ళంతా పి .జనార్ధనరెడ్డిమనుషులు కావడంతోగొడవ ఎందుకులెమ్మని చంద్రబాబుకొంతకాలం ఆగారు. ఈలోపు ఎన్నికలొచ్చాయి.బాబు పార్టీ ఓడిపోయింది. రాష్ట్రమంతాకాలినడకన తిరిగిన రాజశేఖరరెడ్డికిరాజయోగం పట్టింది. నిరాడంబరంగాఉంటానని చెప్పిన వైఎస్‌కు ఇప్పుడు మావోయిస్టులనుంచి ముప్పు పొంచిఉండడంతో ఎయిర్‌పోర్టు నుంచి సచివాలయంవరకు హెలికాప్టర్‌లో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది.చంద్రబాబు నిర్మించతలపెట్టిన హెలిపాడ్‌వైఎస్‌ హయాంలో వేగంగా నిర్మాణంజరిగిపోయింది.

రోజూసచివాలయానికి హెలికాప్టర్‌లో వచ్చే తొలిముఖ్యమంత్రి దేశంలో వైఎస్సేకానున్నారు. ఎనిమిది సీట్లు గల బెల్‌ కెనడాచాపర్‌ హెలికాప్టర్‌ ఆయన కోసం సిద్ధంగా ఉంది.చంద్రబాబు నాయుడుకన్న కలలు అనుకోకుండా వైఎస్‌సొంతమయ్యాయి. జాతక బలమంటేఇదే కావచ్చు. చంద్రబాబు నాయుడుముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కారుల బారు వెళ్ళున్నప్పుడు దాదాపు ఇరవైనిముషాల సేపు ఎక్కడి ట్రాఫిక్‌ను అక్కడఆపేసేవారు. దీనితో నగర జనం తీవ్రఇబ్బందుల పాలయ్యేవారు. తాను చంద్రబాబులాట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగజేయనని అధికారంలోకి వచ్చినకొత్తలో వైఎస్‌ ప్రకటించారు. అయినా ఆచరణలో అదినీరుగారిపోయింది. భద్రతపేరుతో అధికారులు ట్రాఫిక్‌ను పావుగంటసేపు నిలిపివేస్తున్నారు.

నగరంలోవైఎస్‌ హెలికాప్టర్‌ యానం వల్ల ట్రాఫిక్‌ఇబ్బందులు తొలగుతాయని, కాన్వాయ్‌కిఅయ్యే పెట్రోలు ఖర్చు, హెలికాప్టర్‌కు అయ్యేఖర్చు దాదాపు సమానమని అధికారులుసమర్ధించుకుంటున్నారు. ముఖ్యమంత్రికారుకు ముందు వెనక వెళ్ళేఇరవైకి పైగా కార్ల పెట్రోలుకు వేలాదిరూపాయలు నిత్యం ఖర్చువుతోంది. ఇవి కాకిలెక్కల్లా కన్పిస్తున్నాయి కదూ?పుచ్చలపల్లి సుందరయ్య వంటిలోక్‌సభ సభ్యులు ఢిల్లీలో సైకిల్‌ మీద పార్లమెంటు హౌస్‌కువెళ్ళేవారు.ఆడంబరమైనా, భద్రత కోసమైనా ప్రజాధనాన్ని వృధా చేయడం అక్రమం.అధర్మం.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+