వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తన వాళ్ళకోసంవైఎస్‌ తెగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 02-11-2005

హైదరాబాద్‌: చీఫ్‌ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌, ముగ్గురుకమిషనర్‌ పోస్టులకు దీపావళికి ముందు రోజు రాష్ట్ర ప్రభుత్వంనియామకాలు చేసింది. చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌కమిషనర్‌గా రిటైర్డు ఐఎఎస్‌ అధికారిఅర్హను నియమించగా, ముగ్గురుకమిషనర్‌ పదవులను వైఎస్‌ప్రభుత్వం తన అనుకున్నవాళ్ళకి కట్టబెట్టింది. సమాచారంతెలుసుకునే హక్కును చట్టబద్ధం చేయడంతో వివిధ ప్రభుత్వ శాఖలనుంచి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండేలాచూడడం రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌కమిషన్‌ విధి. ఇంతవరకు బాగానే ఉంది.ఇటువంటి పోస్టులు వచ్చినప్పుడల్లాఅర్హులకు కాకుండా ఆశ్రీతులకు కేటాయించిపక్షపాతం చూపడం విమర్శలకుతావు ఇస్తోంది.

కొత్తగానియమితులైన ముగ్గురుకమిషనర్లలో ఒకరు కాంగ్రెస్‌ పార్టీకి చెందినన్యాయవాది, ఇంకొకరు ముఖ్యమంత్రిసలహాదారుకు సన్నిహితుడు. మరొకరుస్వయంగా ముఖ్యమంత్రికి సన్నిహితుడైనజర్నలిస్టు. కమిషనర్ల పదవీకాలంఐదేళ్ళు. వీరికి ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి హోదా ఉంటుంది. కారు, బంగళా,ఇతర అలవెన్సుల రూపేణా ప్రభుత్వంవీరిపై ఏటా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయవలసివస్తుంది. కాంగ్రెస్‌ప్రభుత్వం తనఅనుకున్నవాళ్ళకి ఈ పదవులుకట్టబెట్టింది. తెలుగుదేశంఅధినాయకుడు చంద్రబాబు నాయుడు కూడాతానేమీ తక్కువ తినలేదన్నట్టుతనవాళ్ళ జాబితాను ప్రభుత్వానికిసమర్పించింది. చంద్రబాబు కంటే జగమొండి అయిన రాజశేఖరరెడ్డితన వాళ్ళకే ఆ పదవులు దక్కేలా చూసుకున్నారు.

ఇన్‌ఫర్మేషన్‌కమిషనర్లకు జుడిషియల్‌ అధికారాలుకూడా ఉంటాయి. సమాచారం ఇవ్వడానికినిరాకరించే నిర్లక్ష్యం వహించేఅధికారులకు జరిమానా విధించే అధికారంకమిషన్‌ సభ్యులకు ఉంటుంది. ఇంతముఖ్యమైన పదవులకు ఒక సెర్చ్‌కమిటీ ద్వారా నియామకాలు చేసి ఉంటే బాగుండేది. దేశవ్యాప్తంగాజరుగుతున్న నియామకాలు ఆయా రాష్ట్రప్రభుత్వాల ఇష్టా ఇష్టాలకు అనుగుణంగాజరుగుతున్నాయి. కమిషనర్ల మీదఎంత ఖర్చవుతున్నదో నెల నెలాప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి.సమాచార హక్కు అమలు అక్కడి నుంచే ప్రారంభం కావాలి.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X