వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈనాడు పబ్లిక్‌ఇష్యూ!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 12-12-2005

హైదరాబాద్‌:ఈనాడు దినపత్రిక గ్రూప్‌ త్వరలో పబ్లిక్‌ఇష్యూకు రానున్నట్టు తెలిసింది. ఈనాడు గ్రూపులో దాదాపు 25 సంస్ధలు ఉన్నాయి. మొదటయాడ్‌ ఏజెన్సీతో కెరీర్‌ ప్రారంభించినరామోజీరావు ఆ తర్వాత అన్నదాతపత్రిక స్ధాపించి ఇప్పటి వరకూ మూడు దశాబ్ధాలుగా ఆ పత్రికనువిజయవంతంగా లాభాల్లోనడిపిస్తున్నారు. ఆ తర్వాత ప్రియ పచ్చళ్ళ కంపెనీ పెట్టిన ఆయన ఆసంస్ధను కూడా నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా విదేశాల్లో కూడా పాపులర్‌చేసుకున్నారు.

ఇన్ని వ్యాపారాలనుతనదైన సొంత మేనేజ్‌మెంట్‌పద్ధతుల్లో విజయవంతంగానడిపిన రామోజీరావు మొదటి నుంచి పబ్లిక్‌ఇష్యూకు వ్యతిరేకం.తన వ్యవహారశైలికి పబ్లిక్‌ ఇష్యూసరిపడదని ఆయన భావించేవారు.జనరల్‌ బాడీ మీటింగ్‌లో వంద షేర్లుఉన్న వ్యక్తి కూడా తనను ప్రశ్నించేఅవకాశం ఉండడంతో ఆయనలో దానిని భరించే స్వభావం ఉండేది కాదు. కానీమారిన పరిస్ధితుల్లో ఆయన కూడాకార్పొరేట్‌ తరహాగా మారిపోకతప్పడం లేదు. డెక్కన్‌ క్రానికల్‌పత్రిక గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వెళ్ళి భారీగానిధులు సమకూర్చుకుంది.డెక్కన్‌ క్రానికల్‌ కంటే ఎన్నో రెట్లులాభాలు సంపాదిస్తున్న ఈనాడు గ్రూప్‌ పబ్లిక్‌ఇష్యూకు వెళ్తే ఎన్నో రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ అయ్యే అవకాశముంది.ఈటీవీ దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోఛానల్స్‌ పెట్టుకుంది. రామోజీ ఫిల్మ్‌ సిటీకూడా ఇప్పుడు బ్రేక్‌ఈవెన్‌ దశలో ఉంది. దేశంలోనేమీడియా సంస్ధల్లోఅగ్రభాగన ఉన్న ఈనాడు గ్రూపు పబ్లిక్‌ ఇష్యూలో దాదాపు 500 కోట్లుసమకూర్చుకుంటేరాష్ట్రంలో మిగితా మీడియా గ్రూపులుమరింత ప్రమాదంలో పడడం ఖాయం.ఈనాడు, డెక్కన్‌ క్రానికల్‌ గ్రూపులు మినహామిగతా వాటి మనుగడ కష్ట మవుతుంది.

పబ్లిక్‌ఇష్యూతర్వాత ఇంకా చాలా రంగాల్లోకి ఈనాడు గ్రూపువిస్తరించే అవకాశముంది.ప్రస్తుతం నగరానికి, కాలుష్యానికి దూరంగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఉంటున్నరామోజీరావు ఏడుపదుల వయసులో కూడాచలాకీగా ఉన్నారు. ఆయనకు ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి.పెద్దకుమారుడుకిరణ్‌ ప్రస్తుతం ఈ నాడు ఎండీగాసమర్ధంగా ఆ పత్రికనునడిపిస్తున్నారు. ఆయన భార్య శైలజమార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీగా ఆసంస్ధను బాగా విస్తరించారు. భార్యాభర్తలిద్దరూ కార్పొరేట్‌మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి గలవారు.వీరికున్న ఆసక్తిని గమనించి రామోజీరావుతన సంప్రదాయ మేనేజ్‌మెంట్‌పద్ధతులకు దూరంగా పబ్లిక్‌ ఇష్యూకిరావాలని యోచిస్తున్నారు. ఈనాడు, ఈటీవీ,రామోజీ ఫిల్మ్‌ సిటీ ద్వారా జాతీయ స్ధాయిలోతెలుగువారి కీర్తి పతాకనుఎగురవేసిన రామోజీరావు మరిన్నివిజయాలు సాధించాలని సాటి తెలుగువారిగాఆకాంక్షిద్దాం.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X