వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ ఎత్తులు,జిత్తులు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 05-01-2006

హైదరాబాద్‌:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రంలోనియుపిఎప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామనితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు ప్రకటించడంఫేస్‌ సేవింగ్‌ కోసమే అన్న అభిప్రాయంకలుగుతోంది. ప్రత్యేక తెలంగాణపై సోనియాగాంధీ తమకునిర్ధిష్టమైన హామీ ఇచ్చారని ఆయన ఇప్పటికి ఎన్నోసార్లుచెప్పారు. ఈ విషయంపై సోనియాగాంధీ ఏనాడూనోరు మెదపలేదు. ఆమెమౌనాన్ని ఎవరి ఇష్టమొచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటున్నారు. తెలంగాణరాష్ట్రంపై తుది నిర్ణయం సోనియాగాంధీదేనని కాంగ్రెస్‌అగ్రనాయకులు చేతులు దులుపుకుంటున్నారు.

ఇలా ఉండగా జనవరి26న రాష్ట్రపతి చేసే ప్రసంగంలోతెలంగాణ ప్రస్తావన ఉండేలా చూడడానికిచంద్రశేఖరరావు పావులుకదుపుతున్నట్టు తెలిసింది. గత ఏడాదిరిపబ్లిక్‌డే నాడు రాష్ట్రపతి చేసినప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన ఉంది.అయన తెలంగాణ రాష్ట్రం గురించిప్రస్తావించడంతో హైదరాబాద్‌లోరియల్‌ ఎస్టేట్‌ రేట్లు దారుణంగాపడిపోయి విజయవాడ, గుంటూరులలో బాగాపెరిగాయి. ఈసారి రాష్ట్రపతి ప్రసంగంలోతెలంగాణ ప్రస్తావన ఉంటుందేమోననిహైదరాబాద్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులుఆందోళన చెందుతున్నారు. ఇప్పటికేరేట్లు బాగా పెరిగినందువల్ల తమ ప్లాట్లనుఅమ్ముకోవాలని మధ్యతరగతి వారు తొందర పడుతున్నట్టుసమాచారం. అయితే ఈ సారి రాష్ట్రపతిప్రసంగంలో తెలంగాణ అంశం లేకుండా చేయాలని కాంగ్రెస్‌అగ్రనాయకులు భావిస్తున్నారు. అంతగాఅవసరమనుకుంటే తెలంగాణఅభివృద్ధి అంశం మాత్రమే ఉండేలా యుపిఎ ప్రభుత్వంజాగ్త్రత్తలుతీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇక తెలంగాణవిషయంలో ఓపికపట్టేది లేదని చంద్రశేఖరరావు అంటున్నారు.యుపిఎప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి కేంద్రమంత్రిగా ఉంటూనే ఆయన అనేకఎత్తుగడలు వేస్తున్నారు. సోనియాగాంధీమాత్రం ఆయనకు అపాయింట్‌ మెంట్‌ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. తెలంగాణలో గల్లీగల్లీలో ఆందోళనను రెచ్చగొట్టడానికి ఆయనపథకంవేసుకున్నారు. మొదటి నుంచి ఆయనదుందుడుకుగా వ్యవహరించడంవల్ల ఈ విషయంలో గంద్రగోళం నెలకొంది.తెలంగాణ ప్రజల్లో ఆయనపై విశ్వసనీయత రోజురోజుకీ తగ్గిపోతోంది.తెలంగాణకు చెందిన జ్యోతిషులు మాత్రంవచ్చే ఎన్నికల ముందు తెలంగాణరాష్ట్రం ఏర్పడి తీరుతుందని చెబుతున్నారు.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X