రూ.51కే రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్.. BSNL బంపర్ ఆఫర్ !!

ప్రైవేట్ టెలికాం కంపెనీలు వరుసగా టారిఫ్ ధరలను పెంచుతున్న సమయంలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వినియోగదారులను ఆకట్టుకునే మరో చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.51తోనే రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఉచిత SMSలు, 28 రోజుల వ్యాలిడిటీతో పాటు ఉచిత సిమ్ కార్డ్‌ను అందిస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కొత్త ప్లాన్ ముఖ్యంగా కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించడం ద్వారా ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని BSNL భావిస్తోంది.

ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు..

  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
  • దేశవ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాల్స్
  • రోజుకు 100 ఉచిత SMSలు
  • 28 రోజుల పూర్తి వ్యాలిడిటీ
  • ఉచిత BSNL సిమ్ కార్డ్
  • నేషనల్ రోమింగ్ ఫ్రీ

డేటా పరిమితి పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయని, అయితే వేగం తగ్గే అవకాశం ఉంటుందని సమాచారం.

bsnl-latest-offer-that-2gb-data-per-day-and-unlimited-calls-only-for-rupees-51-recharge

కొత్త సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేక ఆఫర్..

ఈ ప్లాన్ ప్రస్తుతం కొత్తగా BSNL నెట్‌వర్క్‌లో చేరే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కొత్త సిమ్ తీసుకునే సమయంలోనే ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో BSNL నెట్‌వర్క్ బలోపేతం అవుతున్న నేపథ్యంలో ఈ ప్లాన్‌కు మంచి స్పందన లభించే అవకాశం ఉందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.

ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది?

BSNL అధికారిక ప్రకటన ప్రకారం, ఈ 'ఫ్రీడమ్ ఆఫర్' 2026 మే 22 నుంచి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. "కొత్త కనెక్షన్.. స్మార్ట్ సేవింగ్స్.. బలమైన నెట్‌వర్క్.. కేవలం ₹51తో రోజుకు 2GB డేటా, 100 SMSలు, ఉచిత సిమ్, 28 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలు పొందండి."

ఇక ఇటీవల Reliance Jio, Bharti Airtel, Vodafone Idea వంటి సంస్థలు టారిఫ్ ధరలను పెంచడంతో వినియోగదారులు చౌకైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో BSNL తీసుకొచ్చిన ₹51 ప్లాన్ సాధారణ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది. ప్రత్యేకంగా విద్యార్థులు, రెండో సిమ్ వాడేవారు, ఎక్కువ డేటా అవసరమయ్యే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడే అవకాశముంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వారికి BSNL తాజా ఫ్రీడమ్ ఆఫర్ ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ప్లాన్‌లలో ఒకటిగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+