ఒకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం - రూట్, షెడ్యూల్..!!
రైల్వే తెలుగు ప్రయాణీకులకు కీలక అప్డేట్ ఇచ్చింది. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే శాఖ.. ఇప్పుడు వాటిని రెగ్యులర్ సర్వీసులుగా మార్పు చేసింది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు చర్లపల్లి నుంచి తిరుచారపల్లి మధ్య రెగ్యులర్ రైలు ప్రారంభించారు. దీని ద్వారా ఇక నుంచి రైలు మారకుండానే ఇకే రైలులో తిరుపతి, అరుణాచలం, శ్రీరంగా కు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ రైలుకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించారు.
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో స్పెషల్ ట్రైన్ గా కొనసాగిన (రైలు నంబర్ 07615/07616) రైలును ఇక రెగ్యులర్ సర్వీసుగా మార్చింది. ఈ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి తిరుచురాపల్లి, తిరిగి ప్రతి బుధవారం తిరుచురాపల్లి నుంచి చర్లపల్లి చేరుకొనే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. జూలై 7 నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే ఈ రైలు ప్రయోజనకరంగా మారనుంది. చర్లపల్లిలో బయల్దేరి నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో తిరుపతి, అరుణాచలంతో పాటు శ్రీరంగం ఆలయాన్నీ దర్శించుకోవచ్చు. రైలు నంబర్ 17077 చర్లపల్లి టు తిరుచురాపల్లి ఎక్స్ప్రెస్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.20గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా మరుసటి రోజు ఉదయం 8.50గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

అదే విధంగా తిరిగి అక్కడి నుంచి చిత్తూరు, కాట్పాడి జంక్షన్ మీదుగా వెల్లూరు కంటోన్మెంట్, తిరువన్నామలై, తిరుక్కోవిలూర్, విల్లుపురం, వృద్ధాచలం, అరియలూర్, శ్రీరంగం మీదుగా సాయంత్ర 6.45గంటలకు తిరుచురాపల్లి చేరుకుంటుంది. కాగా, రైలు నంబర్ 17078 తిరుచురాపల్లి టు చర్లపల్లి ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం రాత్రి 9.30గంటలకు తిరుచురాపల్లిలో బయల్దేరుతుంది. శ్రీరంగం, అరియలూరు, వృద్ధాచలం, విల్లుపురం, తిరుక్కోవిలూర్, తిరవన్నామలై, వెల్లూరు కంటోన్మెంట్, కాట్పాడి, చిత్తూరు మీదుగా ఉదయం 7.05గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి అక్కడి నుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికూడి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా గురువారం రాత్రి 9.30గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.













Click it and Unblock the Notifications