వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ది నాలుకేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 19-12-2005

;?

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావునోటి దురదలో ఏ మాత్రం మార్పులేదు. ఆయనగతంలో చేసిన ఏ మాట మీదా నిలబడలేదు.తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతేహైదరాబాద్‌లో అడుగుపెడతానని ఆ మాటనునెరవే ర్చుకోలేదు. గత ఏడాదిడిసెంబర్‌లోగానే తెలంగాణ రాష్ట్రంఏర్పాటవుతుందని ఛాలెంజ్‌ చేసినఆయన ఏడాది గడిచిన తర్వాత కూడాఇంకా మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారు.ఆయనకు తెలంగాణప్రజల్లో విశ్వసనీయత పోయిందన్నవిషయం గత మునిసిపల్‌ ఎన్నికల్లోనేరుజువైంది. ఆయన మునిసిపల్‌ఎన్నికలను తాము సీరియస్‌గా తీసుకోవడంలేదని ప్రకటించి ఉంటేటిఆర్‌ఎస్‌ మీద ఇప్పుడు ఇంత ఒత్తిడి ఉండేదికాదు. కాలం కలిసి వచ్చి కేంద్ర కేబినెట్‌మంత్రి అయిన ఆయన కాంగ్రెస్‌ మీదఅలిగినా ఆ పెద్ద పదవిని వదుదుకునే మూడ్‌లోలేరు.

ఉద్యమాలద్వారా సాధించాల్సిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆయనఅధికారంలో భాగస్వామిగా ఉంటూ సాధించాలనిప్రయత్నిస్తున్నారు. ఇది ఆయనకమర్షియల్‌ ఫార్ములా. ఈ ఫార్ములా వల్లఆయన లాభం కలగవచ్చేమో కానీసీరియస్‌గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనికోరుకుంటున్న వారికి ఊరట నివ్వదు.ఒకటి రెండు వారాల్లో కాంగ్రెస్‌తో కలిసిఉండడమా, తెగతెంపులు చేసుకోవటమా అన్నదినిర్ణయించుకుంటామని నిన్న ఆయన ఒకబెదిరింపు ప్రకటన చేశారు. ఆయన బెదిరింపులను కాంగ్రెస్‌పార్టీ చాలాలైట్‌గా తీసుకుంటున్నది. నిజానికికాంగ్రెస్‌ను ఎదిరించి ఆయన చేయగలింది ఏమీ ఉండదు. తెలంగాణ అంశం సత్వరఎజెండాలో లేదని ఆ అంశంపై ఏర్పాటైన యుపిఎ సబ్‌ కమిటీచైర్మన్‌ ప్రణబ్‌ముఖర్జీ స్పష్టం చేశారు. దానికి చంద్రశేఖరరావునేరుగా స్పందించకపోవడం గమనార్హం.తెలంగాణ బిల్లును అడ్డుకుంటామనిప్రకటించిన సిపిఎం నాయకుడుసీతారాం ఏచూరి మీద విరుచుకుపడ్డారుకానీ కాంగ్రెస్‌ నాయకులను నేరుగాఎదిరించే సాహసాన్ని ఆయన చేయడంలేదు.

చంద్రశేఖరరావుబతక నేర్చిన మనిషి. మాటల పిట్ట.రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకుతెలంగాణ అంశాన్ని ఎంచుకున్నారు.ఆయనకు అంకితభావం, చిత్తశుద్ధితక్కువ. అతి తెలివి మాత్రం ఉంది. ఏపద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రం సాధిస్తాడో ఆయన ప్రజలకు చెప్పవలసినఅవసరం ఉంది. తెలంగాణలో సిపిఎంనులేకుండా చేస్తానని ఆయన ఎచ్చులకు పోవడంఅనుచితం. తెలంగాణలో సిపిఎంటిఆర్‌ఎస్‌ కంటే బలంగా ఉందన్న విషయాన్ని ఆయనవిస్మరిస్తున్నారు. మరోరెండ మూడు నెలలు ఆయన ఇలాగే కాలంగడిపితే, తెలంగాణ వాదులు ఆయనమీద చెప్పులతో దాడి చేయడంతప్పదేమోనన్న పరిస్ధితి ఉంది.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X