నైతికస్ధైర్యం తగ్గిన కెసిఆర్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 04-05-2005
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డికి, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికిసవాలక్ష విషయాల్లో అభిప్రాయ భేదాలుఉన్నప్పటికీ ఒక విషయంలో వారిద్దరిమధ్య ఏకాభిప్రాయం ఉంది. అది తెలంగాణ.ఇద్దరూ సమైక్య వాదాన్ని విన్పిస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేచంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తుప్రశ్నార్ధకమవుతుందన్న అభిప్రాయం బలంగావిన్పిస్తోంది. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వైఎస్‌రాజశేఖరరెడ్డి నైతిక బలంక్షీణిస్తుంది. వైఎస్‌కు మూడు ప్రాంతాల్లోవ్యక్తిగత బలం ఉన్నప్పటికీతెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చాలాకాలం అడ్డుకున్నారన్నబాధ ఈప్రాంతం ప్రజల్లో ఉంటుంది.
అయితేతెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందాఅన్నది ఇప్పుడు తాటికాయంత ప్రశ్న.జి.వెంకటస్వామి వంటి సీనియర్‌కాంగ్రెస్ నాయకులు ఎదురుతిరగడంతో కె.చంద్రశేఖరరావుడిఫెన్స్‌లో పడవలసి వస్తోంది. ఒకవైపు అధికారం అనుభవిస్తూతెలంగాణపై అనేక ప్రకటనలు ధైర్యంగాచేస్తున్న చంద్రశేఖరరావు నైతికంగా ఇప్పుడుదిగజారిపోయిన పరిస్ధితిలో ఉన్నారు. చంద్రశేఖరరావు రెండో ఎస్సార్సీకిఒప్పుకున్నారని కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ నోరువిప్పడంతో తెలంగాణ వాదుల్లో కెసిఆర్‌మీద అపనమ్మకం పెరిగింది.
తెలంగాణపైఏర్పాటైన యుపిఎ ఉపసంఘం పనితీరుఅస్పస్టంగా ఉంది. చంద్రశేఖరరావువత్తిడి చేసినప్పుడల్లా పనిచేస్తున్నట్టుఈ కమిటీ ఒక చిన్న డెమో ఇస్తోంది. కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ సంబంధితపార్టీలకు లేఖలు రాయడం ఇటువంటిదే.తెలంగాణకు చెందిన నాయకులకేవరుసగా మూడు సార్లు పిసిసిఅధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని బట్టిఅధిష్టానవర్గం ఆలోచనను అర్ధం చేసుకోవాలి. తెలంగాణనాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సంకేతాన్నిఅధిష్టానవర్గం ఇస్తూ వస్తోంది. వచ్చేఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌అధిష్టానవర్గం తెలంగాణ రాష్ట్రంవిషయంలో గోడ మీద పిల్లిలావ్యవహరించే అవకాశాలున్నాయి.
Recent Stories- కెసిఆర్ ఢిల్లీమంత్రాంగం
- మామూలై పోయిన మామూళ్ళు!
- తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
- తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ చచ్చుడో
- తారల ప్రభావం నిల్!
- ఉద్వేగ అంశాలు
- తారల ప్రభావం నిల్!
- ఇప్పటికిప్పుడు చెరిసగం
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications
